మాదాపూర్ ట్రాఫిక్ సీఐను తోసేసి, కాలితో తన్నిన వైసీపీ ఎమ్మెల్యే కొడుకు!
విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించడమే కాదు, ఇన్‌స్పెక్టర్‌ను కాలితో తన్ని నోటికి పనిచెప్పాడు ఓ ప్రజా ప్రతినిధి కుమారుడు. నోటికి వచ్చినట్టు దూషిస్తే పోలీసులు ఊరుకుంటారా? అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసి అరెస్ట్ చేశారు. పోలీసులను దూషించి, బుక్కయ్యింది ఎవరో కాదు, కృష్ణాజిల్లా కుమారుడు. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ కృష్ణ రాత్రి 9 గంటల ప్రాంతంలో ఖానామెట్ చౌరస్తాలోని మీనాక్షి స్కైలాంజ్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హైటెక్స్ కమాన్ వైపు నుంచి వస్తున్న వాహనాలను కానిస్టేబుల్ కొద్ది సేపు నిలిపివేశారు. ఇదే సమయంలో అటుగా వచ్చిన ఓ కారు నిబంధనలను ఉల్లంఘించిన ముందుకు వెళుతుండగా కానిస్టేబుల్ కృష్ణ అడ్డుకుని వారించాడు. ఆ వాహనంలో ఉన్న జగ్గయ్యపేట ఎమ్మెల్యే కుమారుడు బయటకు దిగి కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగాడు. నన్ను నువ్వు.. అని సంభోదిస్తావా అంటూ కానిస్టేబుల్‌ను నోటికొచ్చినట్టు తిట్టాడు. ఇంతలో ట్రాఫిక్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రాజగోపాల్‌రెడ్డి అక్కడి చేరుకొని అతడిని వారించే ప్రయత్నం చేశాడు. అయినా సరే వినిపించుకోవడంతో పోలీస్ స్టేషన్‌కు రావాల్సిందిగా సామినేని ప్రసాద్‌ను సీఐ రాజగోపాల్ కోరారు. మరింత రెచ్చిపోయిన అతడు నన్నే సేష్టన్‌కు రమ్మంటావా.. అంటూ ట్రాఫిక్ సీఐను పక్కకు నెట్టేసి, కాలుతో తన్ని తిట్లపురాణం అందుకున్నాడు. దీంతో విధులు నిర్వహిస్తున్న మిగతా పోలీసులు అక్కడి చేరుకొని అతడిని మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే తనయుడిపై ఐపీసీ సెక్షన్లు 332, 353, 506 కింద కేసు నమోదుచేసి అదుపులోకి తీసుకున్నారు.
By July 30, 2019 at 08:33AM
No comments