తిరుమలలో విషాదం.. మెట్ల మార్గంలో ముస్లిం భక్తుడు మృతి

శ్రీవారి దర్శనానికి వెళ్తూ ఓ ముస్లిం భక్తులు గుండెపోటుతో చనిపోయిన ఘటన తీవ్ర విషాదం నింపింది. గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని కొల్లిపర్ మండలం తూములూరుకు చెందిన షేక్ బాషైదా(34) శ్రీవేంకటేశ్వరస్వామికి పరమభక్తుడు. అప్పుడప్పుడు తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటుంటాడు. శ్రీవారి దర్శనార్థం శనివారం భార్య గౌసియా, కుమార్తె పర్హానా, కుమారుడు పీరాలతో కలిసి చేరుకున్న బాషైదా.. మధ్యాహ్న సమయంలో అలిపిరి నుంచి మెట్ల మార్గంలో తిరుమలకు బయలుదేరాడు. మరో 10 నిమిషాల్లో కొండపైకి చేరుకుంటారనగా బాషైదాకు గుండెపోటు వచ్చింది. దీంతో తితిదే సిబ్బంది అతడిని హుటాహుటిన అశ్విని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు చెప్పారు. స్వామివారి దర్శనం కోసం వచ్చిన భార్యాపిల్లలతో వచ్చిన బాషైదా విగతజీవిగా మారడంతో విషాదం నెలకొంది. బాషైదా మృతదేహాన్ని తితిదే అధికారులు స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. తన భర్తకు వెంకటేశ్వరస్వామి అంటే చాలా ఇష్టమని, పెళ్లయిన తర్వాత కూడా ఏటా పిల్లలతో కలిసి తిరుమలకు వస్తున్నాడని, ఇప్పుడు శ్రీవారి సన్నిదిలోనే ప్రాణాలు కోల్పోవడం విషాధకరమని భార్య గౌసియా కన్నీటి పర్యంతమవుతూ రోదించడం అక్కడివారిని కలచివేసింది.
By July 07, 2019 at 11:09AM
No comments