Breaking News

జగన్‌కు తెలియకపోవచ్చు.. వైఎస్ఆర్ నా బెస్ట్ ఫ్రెండ్, చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు


ప్రజావేదిక కూల్చివేత, చంద్రబాబు కరకట్ట నివాసం విషయమై ఏపీ అసెంబ్లీ అట్టుడుకుంది. అక్రమ కట్టడాల విషయం కాస్తా.. చంద్రబాబు ప్రస్తావనతో రోడ్ల వెంబడి ఏర్పాటు చేసిన విగ్రహాలవైపు మళ్లింది. రోడ్ల పక్కన ఉన్న వేలాది విగ్రహాల సంగతి ఏంటి అధ్యక్షా అని చంద్రబాబు ప్రశ్నించారు. చట్ట వ్యతిరేకంగా రాజశేఖర రెడ్డివి కొన్ని వేల విగ్రహాలు పెట్టారు. అలాంటి జగన్.. అక్రమ కట్టడాల గురించి మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించిన బాబు.. తన ఆవేదనంతా 74 వేల మంది పేద ప్రజానీకం గురించేనని చెప్పారు. చంద్రబాబు వ్యాఖ్యల పట్ల అధికార పార్టీ నేతలు అంబటి రాంబాబు, ఆనం రాంనారాయణ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజశేఖరరెడ్డి విగ్రహాలను చంద్రబాబు చూడలేకపోతున్నారని.. అధికార పార్టీ నేతలు కామెంట్ చేశారు. దీనికి స్పందించిన చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజశేఖర రెడ్డి విగ్రహాలతో నాకేంటి సమస్య, రాజశేఖర రెడ్డి నాకు బెస్ట్ ఫ్రెండ్. 1977-83 మధ్య మంత్రులుగా ఉన్నాం. ఇద్దరం ఒకే గదిలో నిద్రించాం. ఇద్దరం రాజకీయంగా ప్రత్యర్థులమే కానీ శత్రువులం కాదు. ఈ విషయం జగన్‌కు తెలియకపోవచ్చ’’ని చంద్రబాబు వ్యాఖ్యానించారు. బాబు ఇలా మాట్లాడుతున్నప్పుడు.. జగన్ నవ్వుతూ కనిపించారు. 2007లో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడే లింగమనేని రమేశ్ స్విమ్మింగ్ పూల్ నిర్మించడానికి, మంతెన నిర్మాణాలకు అనుమతి ఇచ్చారని చంద్రబాబు తెలిపారు. నేను ఉండే ఒక్క ఇల్లు కూల్చుతానంటే మాత్రం అది సబబు కాదన్నారు. నామీద కోపంతో 74 వేల ఇళ్లను కూలస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీని మీద ప్రభుత్వం స్పష్టమైన ఆలోచనతో ముందుకు రావాలి. అంబటి రాంబాబు ట్రబుల్ షూటర్ అనుకుంటున్నాడు గానీ.. ట్రబుల్ మేకర్‌గా తయారవుతున్నాడని బాబు ఎద్దేవా చేశారు.


By July 18, 2019 at 11:38AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ap-assembly-sessions-ys-rajasekhara-reddy-was-my-best-friend-says-chandrababu-naidu/articleshow/70272620.cms

No comments