Breaking News

Bigg Boss 3 Telugu: సెక్స్ లేకుండా బిగ్ బాస్‌లో.. నన్నే అడిగారు, ఆమెను అడిగితే తప్పేంటి?


అబిగ్ బాస్ రియాలిటీ షో అంటే వివాదాల సుడిగుండం. వివాదం అనే కాన్సెప్ట్‌ను బేస్ చేసుకుని రూపొందించిన ఈ షో ఆన్ స్క్రీన్‌పైనే కాకుండా ఆఫ్ స్క్రీన్‌లో కూడా వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన బిగ్ బాస్ సీజన్ 3 జూలై 21 నుండి స్టార్ మాలో ప్రసారం కానుంది. తొలి సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. రెండో సీజన్‌కు నాని హోస్ట్‌గా వ్యవహరించారు. ఇక మూడో సీజన్‌కు మరింత హైప్ తీసుకువచ్చేందుకు నాగార్జునను రంగంలోకి దింపింది స్టార్ మా. ఇక గత సీజన్‌కి కంటెస్టెంట్ వీక్‌గా ఉండటంతో ఆ ప్రభావం రేటింగ్స్‌పై పడింది. ఈసారి అలాంటి తప్పులు జరగకుండా.. ఆటను రక్తికట్టించగలిగే సెలబ్రిటీలను బిగ్ బాస్ హౌస్‌కి తీసుకువస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా.. ఎవరైతే కాంట్రివర్శి యాక్టర్స్, యాంకర్లు, పాపులర్ వ్యక్తుల్ని సంప్రదించించారు బిగ్ బాస్ నిర్వాహకులు. అయితే అగ్రిమెంట్‌లో భాగంగా.. చాలా మందికి మొండి చేయి ఎదురైంది. వీరిలో ప్రముఖ యాంకర్ శ్వేతా రెడ్డి, వివాదాస్పద నటి గాయిత్రి గుప్తలు ఉన్నారు. తమను బిగ్ బాస్‌కి సెలెక్ట్ చేసి చివరి నిమిషంలో తమతో అసభ్యంగా ప్రవర్తించి తమను షో నుండి తప్పించారంటూ బిగ్ బాస్ నిర్వాహకులపై క్యాస్టింగ్ కౌచ్ (అవకాశాల పేరుతో పడకసుఖం) ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచారు. ఇది బిగ్ బాస్ యూనిట్‌పై పోలీసు కేసులు పెట్టే వరకూ వెళ్లింది. కాగా ఈ వివాదంపై స్పందించారు బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ కత్తి మహేష్. ముఖ్యంగా గాయిత్రి గుప్త చేసిన ఆరోపణలపై ప్రశ్నలు సంధించారు. బిగ్ బాస్ హౌస్‌కి వస్తే.. 100 రోజుల పాటు సెక్స్ లేకుండా ఉండగలరా? అని నిర్వాహకులు అడగడంలో తప్పేం ఉందన్నారు కత్తి మహేష్. ఈ సందర్భంగా గాయిత్రి గుప్తను ‘యాక్టివ్ సెక్స్ లైఫ్ ఉన్న బోల్డ్ అమ్మాయి’ అంటూ సంచలన ఆరోపణ చేశారు కత్తి మహేష్. జస్ట్ ఆస్కింగ్ అంటూ ఫేస్ బుక్‌లో వివాదాస్పద పోస్ట్ వదిలారు కత్తి మహేష్.. ‘2017 లో.. బిగ్ బాస్ టీం: 70 రోజుకు సెక్స్ లేకుండా ఉండగలరా? నేను: బాత్రూమ్ లో కెమెరాలు ఉండవుగా! పర్లేదు మ్యానేజ్ చేసుకుంటాను. ఇదే ప్రశ్న , ఇదే టీం యాక్టివ్ సెక్స్ లైఫ్ ఉన్న బోల్డ్ అమ్మాయిని ఇప్పడు 2019లో అడిగితే తప్పైపోతుందా? జస్ట్ ఆస్కింగ్! అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కత్తి మహేష్. కాగా.. బిగ్ బాస్ నిర్వాహకులపై రాయదుర్గం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు . రఘు, రవికాంత్ అనే ఇద్దరు కార్యక్రమ నిర్వహకులు ఇటీవల తనను కలిసి బిగ్‌బాస్‌ షో అవకాశం కల్పిస్తానని చెప్పి అసభ్యంగా ప్రవర్తించారని.. 100 రోజుల పాటు సెక్స్ లేకుండా బిగ్ బాస్‌లో ఉంటావా? అని అడిగారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో సెలెక్ట్ అయినట్టుగా తనతో తొలిత అగ్రిమెంట్ కూడా చేసుకున్నారని, అనంతరం బిగ్‌బాస్‌ను ఎలా సంతృప్తి చేస్తారని అసభ్యకరరీతిలో ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు గాయిత్రి గుప్త. అయితే తాజాగా మళ్లీ మీరు బిగ్ బాస్‌కి సెలెక్ట్ కాలేదంటూ జలక్ ఇచ్చారని వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు. బిగ్ బాస్‌లో ఆఫర్ వచ్చిందనే కారణంతో తనకు వచ్చిన ఆరు సినిమా ఛాన్స్‌లు కూడా వదిలేశానని.. ఇప్పుడు తనను బిగ్ బాస్‌కి సెలెక్ట్ చేయకుండా చేశారని ఇందుకు నష్టపరిహారం చెల్లించాలని బిగ్‌బాస్‌ నిర్వాహకులను కోరానని తెలిపింది గాయిత్రి గుప్తా.


By July 15, 2019 at 11:55AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/kathi-mahesh-controversial-statement-on-gayathri-gupta-over-bigg-boss-3-telugu-casting-couch-controversy/articleshow/70223802.cms

No comments