Breaking News

రూ.15వేల పూచీకత్తుతో రాహుల్‌గాంధీకి బెయిల్


పరువు నష్టం కేసులో ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఊరట లభించింది. రూ.15వేల పూచీకత్తుపై ముంబయి కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ప్రముఖ జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త గౌరీ లంకేశ్ 2017లో కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణహత్యకు గురయ్యారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు క్రమంగా రాజకీయ రంగు పులుముకుంది. ఈ ఘటనపై స్పందించిన ఆర్ఎస్ఎస్, బీజేపీపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అది ఆర్ఎస్ఎస్, బీజేపీ కలిసి చేయించిన హత్య అనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. దీనిపై మండిపడిన ఆర్ఎస్ఎస్ రాహుల్‌పై పరువునష్టం దావా వేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా రాహుల్ గాంధీ గురువారం ముంబయిలోని న్యాయస్థానానికి హాజరయ్యారు. తాను ఎవరి పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయలేదని, తనపై కేసును కొట్టేయాలని రాహుల్ కోర్టును కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం రాహుల్‌గాంధీకి రూ.15వేల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. ఆ మొత్తాన్ని మాజీ ఎంపీ ఏక‌నాథ్ గైక్వాడ్ చెల్లించంతో రాహుల్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.


By July 04, 2019 at 12:32PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/congress-leader-rahul-gandhi-gets-bail-in-rss-defamation-case/articleshow/70069203.cms

No comments