Breaking News

సినీ నిర్మాతగా అవతారం.. 14 మంది నుంచి రూ.90లక్షల దోపిడీ


డిగ్రీ చదివి ఓ సంస్థలో ఉద్యోగం చేస్తున్న యువకుడు జల్సాల కోసం తప్పుదారి పట్టాడు. సినీ నిర్మాతనంటూ ప్రచారం చేసుకుని అనేక మందిని ముంచాడు. వచ్చే జీతాన్ని సరిపెట్టుకోకుండా జల్సాలు చేయడం కోసం, అమ్మాయిలతో షికారు చేసేందుకు ప్రముఖుడి అవతారమెత్తి వారి నుంచి రూ.లక్షల్లో వసూలు చేశాడు. ఇప్పుడు అతడి అసలు స్వరూపం బయటపడటంతో బాధితులు లబోదిబోమంటున్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం రచ్చవారిపల్లెకు చెందిన కందుకూరి రాజేష్ డిగ్రీ చదివి ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చాడు. ఓ సంస్థలో చిన్న ఉద్యోగంలో చేరినా వచ్చే జీతం అతడి జల్సాలకు సరిపోయేది కాదు. దీంతో ఫ్రెండ్స్ పేరిట క్రెడిట్ కార్డులు తీసుకుని డబ్బులు వాడుకుని బిల్లులు కట్టకుండా ఉడాయించాడు. దీంతో కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. బెయిల్‌పై బయటకు వచ్చిన రాజేష్ ఓ సినీ సంస్థను ఏర్పాటుచేసి సినిమా తీస్తున్నానంటూ భారీ ప్రచారం చేసుకున్నాడు. దీంతో చాలామంది అతడిని సంప్రదించగా మంచి వేషాలు ఇస్తానంటూ డబ్బులు వసూలుచేశాడు. రాజేష్ అక్కడితో ఆగిపోలేదు. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన యువతితో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. తనకు రాయలసీమలో వేలాది ఎకరాల భూమి ఉందని, రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులతో మంచి సంబంధాలున్నాయని, ఏ పని అయినా చేసిపెడతానని నమ్మించాడు. దీంతో ఆ యువతి ఇంజినీరింగ్ పూర్తిచేసిన తన తమ్ముడికి జాబ్ ఇప్పించాలని కోరింది. బీహెచ్‌ఈఎల్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పిన రాజేష్ ఆమె నుంచి మొదటగా రూ.4లక్షలు తీసుకున్నాడు. తర్వాత ఏదో వంక చెబుతూ మొత్తం రూ.30లక్షల వరకువసూలు చేశాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు రాజేష్‌ను అరెస్ట్ చేసి విచారించారు. అతడు ఉద్యోగాల పేరుతో మొత్తం 14 మందిని నమ్మించి రూ.90లక్షల వరకు వసూలు చేసినట్లు గుర్తించారు. రాజేష్‌పై


By July 31, 2019 at 10:09AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/one-held-for-cheating-job-seekers-in-hyderabad/articleshow/70460224.cms

No comments