Breaking News

Kaleshwaram Project: మేడిగడ్డ చేరుకున్న జగన్


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మేడిగడ్డకు చేరుకున్నారు. హెలికాప్టర్‌లో తాడేపల్లి నుంచి బయల్దేరిన ముఖ్యమంత్రి.. ఉదయం 9.30గంటలకు ప్రాజెక్ట్ దగ్గరకు చేరుకున్నారు. జగన్ వెంట మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్‌లు ఉన్నారు. సీఎం, ఏపీ మంత్రులకు తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వాగతం పలికారు. జగన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉదయం 10.30 గంటలు నుంచి 11 గంటల మధ్య గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్, సీఎం జగన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌లు బ్యారేజీ పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడే ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తారు. అక్కడి నుంచి గవర్నర్, ముగ్గురు ముఖ్యమంత్రులు మేడిగడ్డ పంప్‌హౌస్‌ ఉన్న కన్నెపల్లికి హెలికాప్టర్‌లో చేరుకొని పూర్ణాహుతిలో పాల్గొంటారు. అనంతరం అతిథులు సుగంధ మంగళ ద్రవ్యాలను హోమంలో వేస్తారు. అక్కడి నుంచి 6వ నంబర్‌ మోటార్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారు. నీటి ప్రవాహాలుండే డెలివరీ సిస్టర్న్‌ వద్ద గోదావరి జలాలకు పూజలు చేస్తారు. కన్నెపల్లి గెస్ట్‌హౌస్‌లో మధ్యాహ్న భోజనాలు చేసిన తర్వాత తిరుగు ప్రయాణమవుతారు. అంతకముందు మేడిగడ్డ యాగశాలలో కేసీఆర్ దంపతులు హోమంలో పాల్గొన్నారు.


By June 21, 2019 at 10:16AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/kaleshwaram-project-inauguration-ap-cm-ys-jagan-reaches-medigadda/articleshow/69885332.cms

No comments