Breaking News

గానా సంగీత 'ప్రపంచం'.. వినండి ఉల్లాసంగా, ఉత్సాహంగా


సందర్భంగా టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్‌‌నకు చెందిన మ్యూజిక్ యాప్ సంగీత ప్రియులకు శుభవార్త అందించింది. ఇప్పటివరకు ఇండియా వరకే పరిమితమైన గానాను విదేశాలకు విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో జూన్ 21 నుంచి గానా ద్వారా పాటలు వినే అద్భుత అవకాశాన్ని కల్పించింది. మీ ఇంటి నుంచి భారతీయ భాషా చిత్రాల పాటలతో పాటూ మిగతా దేశాల్లోని భాషల్లోనూ అందుబాటులోకి తీసుకొచ్చింది. డెస్క్‌టాప్, మొబైల్ వెబ్ ద్వారా యూజర్స్ మ్యూజిక్ డే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత ఏదో ఒక దేశాన్ని ఎంచుకోవచ్చు.. ఇంటరాక్టివ్ మ్యాప్‌లో ఎవరికి కావాల్సిన ప్రాంతంలో.. ఎవరు భాషలో వారు పాటల్ని వినొచ్చు. అంతేకాదు దేశీయంగా భాషల వారీగా పాపులర్ సాంగ్స్‌‌ను కూడా వినే వీలు కల్పించారు. గానా సీఈవో ప్రశాన్ అగర్వాల్ స్పందిస్తూ.. ‘ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది సంగీత ప్రియులు విభిన్నమైన పాటలు, సంగీతాన్ని కోరుకుంటారు. దేశంలో అతిపెద్ద మ్యూజిక్ యాప్‌గా ఉన్న గానాలో.. కోట్లాదిమంది యూజర్లు స్పానిష్, లాటిన్, అరబిక్, ఫ్రెంచ్‌తో పాటూ ఆసియా భాషల్లో కూడా మ్యూజిక్ కావాలని కోరుకున్నారు. అందుకే ఈ వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా.. సంగీతమంటే ఓ ప్లే లిస్ట్‌ కాదు.. ఓ గొప్ప అనుభూతిని వారికి బహుమతిగా ఇవ్వదలచుకున్నాం’అన్నారు. ‘ఇక గానా యూజర్లు ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో మ్యూజిక్‌ను ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెంచ్ రివెరియా కేఫ్‌ బాల్కనీలో నిలబడి.. కాఫీ సిప్ చేస్తూ.. హాయిగా సంగీతం వినొచ్చు. ఇంట్లో జరిగే పార్టీల్లో ట్రెండియెస్ట్ హిట్లతో సంగీతంలో ఓలలాడొచ్చు. సంగీత ప్రియులకు ఇదే మా ఆహ్వానం.. ఈ సంగీత ప్రపంచాన్ని మీరు ఆస్వాదించండి. మీకు జీవితాంతం గుర్తిండిపోయే అనుభూతిని గానా ఇస్తోంది’అన్నారు. గానా సంగీత ప్రియులకు ఫెవరెట్ మ్యూజిక్ యాప్.. దేశవ్యాప్తంగా ప్రతి నెలా దాదాపు 100 మిలియన్ యూజర్లను కలిగి ఉంది. బాలీవుడ్, ఇంటర్నేషనల్, 30 ప్రాంతీయ భాషల్లో (హిందీ, తమిళ్, తెలుగు, మరాఠీ, కన్నడ, పంజాబీ, మలయాళం, భోజ్‌పురిక, రాజస్థానీ, బెంగాలీ, అస్సామీ, ఒరియా, ఇంగ్లీష్) పాటలు అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్ 2010లో టైమ్స్ ఇంటర్నెట్ లాంఛ్ చేసింది. దేశంలోనే అన్ని భాషల్లో పాటలే అందించే మ్యూజిక్ యాప్‌గా ఉంది.


By June 21, 2019 at 11:14AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/groove-to-music-from-50-countries-around-the-globe-with-gaana-this-world-music-day/articleshow/69886039.cms

No comments