Breaking News

టీటీడీ బోర్డ్ మెంబర్‌గా దిల్‌రాజు.. నిజమేనా!?


ఇటీవల టీటీడీ 50వ చైర్మన్‌గా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయ్, వైసీపీ కీలకనేత వైవీ సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు విచ్చేయగా వారితో పాటు టాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు కూడా హాజరయ్యారు. అయితే ఈయన హాజరుకావడంతో వైఎస్ జగన్‌.. దిల్‌రాజుకు టీటీడీ పాలకమండలిలో సభ్యుడిగా అవకాశం కల్పించబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

అయితే.. యాదృచ్ఛికమో ఏమో కానీ సరిగ్గా చైర్మన్ ప్రమాణం రోజే దిల్ రాజు తిరుమలలో ప్రత్యక్షమవ్వడంతో ఈ వార్తకు మరింత బలం చేకూరింది. ఇదిలా ఉంటే విజయవాడ ఎంపీగా వైసీపీ తరఫున పోటీ చేసిన పీవీపీ కూడా దిల్‌ రాజుకు మంచి స్నేహితుడు కావడం.. ఆయనే దగ్గరుండి జగన్‌తో మాట్లాడినట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా.. దిల్ రాజు కూడా వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు కావడం.. ఇందుకు ప్రతీకగా తన బ్యానర్‌కు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అని పేరు పెట్టడం జరిగింది.

అంతేకాదు తన ప్రతీ సినిమా విడుదలకు ముందు తిరుమల కొండకెళ్లి శ్రీవారిని దర్శించుకోవడం ఈ టాప్ నిర్మాతకు ఆనవాయితీగా వస్తోంది. అయితే బోర్డులో మెంబర్‌గా లేదా తిరుమల సన్నిధానంలో ఏ బాధ్యతలు అప్పగించినా సరే.. తనకు స్వామివారికి సేవ చేసుకునే అవకాశం దక్కినట్లేనని.. ఎప్పుడో ఒకసారి తనకు పదవి వరించకపోతుందా..? అని దిల్ రాజు వేచి చూసేవారట. అయితే తాజాగా తన మిత్రుడు పీవీపీతో కేటీఆర్ కూడా జగన్‌కు రెకమెండ్ చేయడంతో ఆ కోరిక కాస్త తీరిందంటున్నారు. అయితే రెండ్రోజులుగా ఈ వ్యవహారం హాట్ టాపిక్ అవుతున్నప్పటికీ దిల్ రాజు మాత్రం ఇంత వరకూ రియాక్ట్ అవ్వలేదు.



By June 25, 2019 at 02:34AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/46399/dil-raju.html

No comments