Breaking News

ప్రియురాలిపై కిరాతక దాడి.. మంగళూరులో దారుణం


కర్ణాటకలోని మంగళూరులో దారుణం జరిగింది. ప్రేమించిన అమ్మాయిపై ఓ యువకుడు క్షణికావేశంలో కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఓ ప్రాంతంలో ప్రియురాలితో గొడవపడిన సుశాంత్ అనే యువకుడు కత్తితో ఆమె గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావంతో కింద పడిపోయిన ఆమెపై కూర్చుని కడుపు భాగంలోనూ పొడిచాడు. అనంతరం తాను కూడా కత్తితో పొడుచుకున్నాడు. ఈ దాడికి సంబంధించి సీసీ కెమెరాల్లో రికార్డయిన ఈ దృశ్యాలు సంచలనం రేపుతున్నాయి. సుశాంత్, ఓ యువతి కొంతకాలం ప్రేమించుకున్నారు. అతడి ప్రవర్తన సరిగా లేకపోవడంతో యువతి అతడికి దూరమైంది. అయితే తనను ప్రేమించాల్సిందేనంటూ సుశాంత్ వేధించడంతో ఆ యువతి ఏప్రిల్ నెలలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు నడుస్తుండగానే శుక్రవారం మాట్లాడుకుందామని యువతిని ఓ ప్రాంతానికి పిలిచిన సుశాంత్ ఆమెపై దాడికి పాల్పడ్డాడు. అనంతరం తాను కూడా కత్తితో పొడుచుకుని బీభత్సం సృష్టించాడు. అతడి బారి నుంచి రక్షించి యువతిని ఆస్పత్రికి తరలించేందుకు స్థానికులు ప్రయత్నించగా ప్రేమోన్మాది వారిని బెదిరించాడు. కొద్దిసేపటి తర్వాత అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో స్థానికులు పోలీసులకు సమచారమిచ్చి ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రేమికుల మధ్య వచ్చిన గ్యాప్ కారణంగా ఈ దాడి జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.


By June 29, 2019 at 10:38AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/love-attack-stabbing-of-girl-suicide-attempt-in-mangaluru/articleshow/69998769.cms

No comments