Breaking News

టీ తాగేందుకు వచ్చి లారీ కింద నలిగిపోయారు... చింతూరులో ఘోర ప్రమాదం


భారీ లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పటి నలుగురి ప్రాణాలను బలిగొన్న ఘటన జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన మండలంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌లోని కుంట ప్రాంతం నుంచి భారీ లోడుతో భద్రాచలం వైపు వెళ్తున్న లారీ చింతూరు మండలంలోని చట్టి కూడలి వద్ద మలుపు తీసుకునే క్రమంలో అదుపుతప్పి పక్కనే ఉన్న ఓ హోటల్‌లోకి దూసుకెళ్లింది. అనంతరం దాని పక్కనే ఉన్న ఆర్టీసీ బస్ షెల్టర్‌ను ఢీకొని బోల్తాపడింది. ఈ ఘటనలో హోటల్‌లో టీవీ చూస్తున్న ముగ్గురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో మహిళ చింతూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. మృతులను సోయం కమల (20), సోయం జోగి (35), ముచ్చిక చుక్కమ్మ(22), సుబ్బమ్మ(30)గా గుర్తించారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడటంతో అతడిచిన చింతూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చింతూరు ఎస్సై సురేష్‌బాబు ఘటనాస్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. మృతులంతా ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా కామరాజుపాడుకు చెందినవారుగా గుర్తించారు. వీరంతా చట్టిలోని ఓ మిల్లులో పనిచేస్తుంటారని, టీ తాగేందుకు హోటల్‌కు వచ్చిన టీవీ చూస్తున్న సమయంలో ఈ ఘోరం జరిగిందని పోలీసులు తెలిపారు.


By June 30, 2019 at 07:51AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/heavy-load-lorry-rushes-into-hotel-in-east-godavari-district-4-women-died/articleshow/70007303.cms

No comments