Breaking News

విషమిచ్చి కుక్కలను చంపిన వైనం.. మున్సిపల్ కమిషనర్, సిబ్బందిపై కేసులు!


వికారాబాద్, మున్సిపాల్టీ పరిధిలోని వీధి కుక్కలకు విషాహారం పెట్టి అధికారులు చంపినట్టు జంతు ప్రేమికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పురపాలక సంఘం కమిషనర్, సిబ్బంది మీద కేసు పోలీసులు కేసు నమోదు చేశారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉండటంతో మున్సిల్ సిబ్బంది వాటిని బంధించి విషాహారం ఇచ్చి చంపారు. తర్వాత వాటిని మూకుమ్మడిగా భూమిలో పాతి పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న చైతన్య అనే జంతు ప్రేమికుడు పొలీసులకు పిర్యాదు చేశాడు. ఈ ఘటనపై ఐసీపీ 11, 429 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, ఇందులో సిబ్బందితోపాటు కమిషనర్‌ పేరు కూడా చేర్చారు. అలాగే భూమిలో పాతిపెట్టిన 20 కుక్కల మృత‌దేహాలను వెలికితీసి పోస్ట్‌మార్టం నిర్వహించారు. వాటి నమూనాలను ల్యాబ్ పంపినట్టు తెలిపారు. నాలుగు రోజుల కిందట జరిగిన ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందినట్టు వికారాబాద్ ఎస్పీ తెలిపారు. మరోవైపు, ఈ ఘటనకు పాల్పడినవారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. జంతువుల సంరక్షణ పట్ల తెలంగాణ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో చెప్పడానికి ఇదో ఉదాహరణ అని అంటున్నారు. జూన్ 19న వికారాబాద్‌లో 30 కుక్కలను మున్సిపాల్టీ సిబ్బంది చంపి పూడ్చిపెట్టారని, జూన్ 22న సిద్ధిపేటలో 40 కుక్కలకు విషమిచ్చి చంపారని ఆరోపిస్తున్నారు. దీనిపై జంతు ప్రేమికుడు, రిపబ్లిక్ టీవీ ఏపీ తెలంగాణ కరస్పాండెంట్ కృష్ణ‌మూర్తి ట్విట్టర్‌లో దీనిపై స్పందించారు. ‘ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు బాధగా ఉంది.. జూన్ 19న వికారాబాద్ మున్సిపాల్టీ సిబ్బంది పాతిపెట్టిన 30 కుక్కలను వెలికితీశారు.. జూన్ 22న సిద్ధిపేటలో 40 కుక్కలకు విషమిచ్చి చంపారు.. మూగ జీవాలను హతమార్చడం వాటి నిరోధానికి పరిష్కారం కాదని, ఇది చట్టవిరుద్దం.. ఈ రెండు ఘటనలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేసినా ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.. జంతు సంరక్షణ తెలంగాణలో ఇలా ఉంది’ అంటూ మండిపడ్డాడు.


By June 23, 2019 at 11:56AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/stray-dogs-culled-and-poisoned-by-civic-body-staff-in-vikarabad-and-siddipet/articleshow/69912112.cms

No comments