Breaking News

ఒడిశాలో ఘోరం.. ఇంట్లోకి చొరబడి మహిళపై గ్యాంగ్ రేప్


మహిళలకు బయటే కాదు.. ఇంట్లోనూ రక్షణ ఉండటం లేదు. దీనికి ప్రత్యక్ష నిదర్శనమే ఒడిశాలో జరిగిన ఘటన. రాత్రివేళ భర్త, పిల్లలతో కలిసి పడుకున్న మహిళపై కన్నేసిన దుండుగులు ఆమె ఇంట్లోకి చొరబడి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. భర్త, పిల్లలను కట్టేసిన దుండుగులు వారి కళ్లెదుటే అఘాయిత్యానికి పాల్పడటం మరింత విచారకరం. ఒడిశాలోని కేంద్రపడ జిల్లా నికిరియా ప్రాంతంలో భార్యభర్తలు ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. శుక్రవారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఎవరో తలుపు కొట్టడంతో భర్త తలుపు తెరిచాడు. ఆ వెంటనే ఇంట్లోకి చొరబడిన ముగ్గురు దుండుగులు భర్తను తీవ్రంగా కొట్టారు. అతడి కేకలకు నిద్రలేచిన భార్య, పిల్లలను గట్టిగా అరవగా చంపేస్తామని బెదిరించారు. తర్వాత భర్త, పిల్లలపై తీవ్రంగా దాడిచేసి చేతులు కట్టేశారు. తమ లైంగిక కోరిక తీర్చకపోతే భర్త, పిల్లలను చంపేస్తామని బెదిరించారు. దీనికి ఆమె ఒప్పుకోకపోవడంతో వివస్త్రను చేసి ఒకరి తర్వాత ఒకరు ఆమెపై అత్యాచారం చేశారు. తన కళ్లెదుటే భార్యపై అఘాయిత్యం జరుగుతున్నా రక్షించుకోలేని స్థితిలో భర్త కన్నీరుమున్నీరయ్యాడు. మహిళపై సామూహిక అత్యాచారం చేసిన అనంతరం దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొంత సమయం తర్వాత వారింటి నుంచి ఏడుపులు వినిపించడాన్ని గమనించిన స్థానికులు అక్కడికి చేరుకుని జరిగిన ఘోరం తెలుసుకుని షాకయ్యారు. బాధితురాలితో పాటు ఆమె భర్త, పిల్లలను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన సమాచారం తెలుసుకున్న పోలీసులు బాధితులను పరామర్శించి వివరాలు సేకరించారు. వారు చెప్పిన వివరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు.


By June 30, 2019 at 09:26AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-gang-raped-at-home-in-odisha/articleshow/70007794.cms

No comments