Breaking News

‘పోలవరం కంటే కాళేశ్వరంలోనే జగన్ ఎక్కువ టైం గడిపారు’


తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టును శుక్రవారం జాతికి అంకితం చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే, గతంలో కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ మూడు రోజులు జలదీక్ష చేశారు. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తాజాగా, దీనిపై ప్రధాన ప్రతిపక్షం విమర్శలు గుప్పిస్తోంది. మాజీ మంత్రి విజయవాడలో మాట్లాడుతూ... కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కర్నూలులో మూడు రోజులు జలదీక్ష చేసిన జగన్‌ అప్పుడు ఏమి మాట్లాడారో గుర్తు చేసుకోవాలని వ్యాఖ్యానించారు. జగన్‌ చేసిన జలదీక్ష ప్రసంగం వీడియోను ఆయన ఈ సందర్భంగా ప్రదర్శించారు. ప్రారంభోత్సవానికి శుక్రవారం వెళ్లాలి కాబట్టి జగన్ మొన్న పోలవరం వెళ్లినట్టు ఉందన్న దేవినేని ధ్వజమెత్తారు. పోలవరంలో కంటే కాళేశ్వరంలోనే ఆయన ఎక్కువ సమయం గడిపారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం నిర్మిస్తే ఇరు తెలుగు రాష్ట్రాలు భారత్‌, పాకిస్తాన్‌లా మారతాయని జలదీక్షలో జగన్‌ చేసిన వ్యాఖ్యలను ఉమా గుర్తు చేశారు. ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. అంతేకాదు, తమపై కోపంతో పోలవరం పనులు ఆపడం సరికాదని ఆయన హితవు పలికారు. ప్రాజెక్టు డిజైన్‌లు దేవినేని ఎలా చెబితే అలా చేయరని, కేంద్రానికి పోలవరం ఇస్తానని జగన్‌ ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలను దేవినేని ప్రస్తావించారు. అలాగే ప్రాజెక్టు అంచనాలపై జగన్ చేస్తున్న ఆరోపణలను కూడా ఆయన ఖండించారు. రూ.16వేల కోట్ల ప్రాజెక్టుని రూ.56 వేల కోట్లకు తాము పెంచామని జగన్ అంటున్నారని, పోలవరం అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించగలదా అని ప్రశ్నించారు. పీపీఏ ఆమోదించిన అంచనాలు ఎంత తగ్గిస్తారు.. ఎలా తగ్గిస్తారో తగ్గించి చూపాలని ఉమా సవాల్‌ విసిరారు. పోలవరం అంచనాలను తగ్గిస్తే తాము కూడా స్వాగతిస్తామని దేవినేని పేర్కొన్నారు. నిబంధనల మేరకే పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం చేపట్టినట్లు ఆయన వివరించారు. తమ ప్రభుత్వ హాయంలో 60 శాతం అప్పర్‌ కాఫర్‌ డ్యాం పూర్తయిందని ఉమా తెలిపారు.


By June 22, 2019 at 12:09PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/tdp-leader-devineni-uma-slams-on-ap-cm-jagan-over-comments-on-polavaram/articleshow/69901360.cms

No comments