Breaking News

చిరంజీవి ‘సైరా’కు మరో ప్రమాదం


  • భారీ అగ్ని ప్రమాదానికి గురైన సైరా సెట్
  • ఎటువంటి ప్రాణ నష్టం జరుగలేదు
  • ‘సైరా’ను వెంటాడుతున్న కష్టాలు

మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో ‘సైరా నరసింహారెడ్డి’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. దాదాపు షూటింగ్ చివరి దశలో ఉంది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో శరవేగంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం కోసం టీం ఓ భారీ సెట్ వేసింది. ఆ సెట్‌లో ఈరోజు(శుక్రవారం) భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే....

హైదరాబాద్ పరిసరాల్లో నార్సింగ్ పీఎస్ పరిధి కోకాపేట‌లోని చిరంజీవి ఫామ్ హౌస్‌లో సైరా నరసింహారెడ్డి చిత్రంకి సంబంధించి ఓ భారీ సెట్ ను వేసి అక్కడ షూటింగ్ చేస్తున్నారు. ఈ షూటింగ్ లో చిరంజీవి పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అయితే ఈరోజు ఉదయం షూటింగ్ కోసం వేసిన సెట్టింగ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఏమి కాలేదని తెలుస్తుంది.

ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, నయనతార వంటి స్టార్‌లు నటిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. కాకపోతే రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.



By May 04, 2019 at 04:26AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45789/sye-raa.html

No comments