Breaking News

‘మహర్షి’ బాగున్నా ఏదో లోటు కనిపిస్తుంది


మహేష్ బాబు - వంశి పైడిపల్లి కాంబోలో మహేష్ ల్యాండ్ మార్క్ మూవీ మహర్షి చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూజా హెగ్డే - అల్లరి నరేష్ నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి క్రిటిక్స్ నుండి కూడా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఎప్పుడు క్లాస్ చిత్రాలను తెరకెక్కించే వంశి పైడిపల్లి, మహేష్ 25 మూవీ మహర్షిని కూడా అంతే రిచ్ గా క్లాస్ గా తెరకెక్కించాడు. మహేష్ ఈ సినిమాలో రిషి, మహర్షిగా ఎలా ఎదిగాడో... ఆ ఎదుగుదలలో ఎన్ని సోషల్ మెస్సేజ్ లు ఇవ్వాలో అన్ని సోషల్ మెస్సేజ్ లను వంశి పైడిపల్లి చూపించడానికి ట్రై చేసాడు. మహేష్ ల్యాండ్ మార్క్ మూవీ మహేష్ కి ఒక జ్ఞాపకంగా ఉండాలనే తాపత్రయంతో మహర్షిని తెరకెక్కించినట్లుగా అనిపిస్తుంది. మహేష్ బాబు మాత్రం స్టూడెంట్ గా, సీఈవోగా, రైతు సమస్యలను తీర్చే కుర్రాడిగా అదరగొట్టేసాడు. 

ఒక మాములు ఫ్యామిలిలో పుట్టి.. తండ్రిలా అన్నిటికి సర్దుకుపోకుండా అందరికి అందనంత ఎత్తుకు ఎదగాలనే ఆశయంతో.. ఫ్రెండ్స్ ని పక్కనబెట్టి అమెరికాలో ఒక బడా కంపెనీకి సీఈవోగా అయిన తర్వాత తన ఈ ఎదుగుదలకు తన ఫ్రెండ్ రవి చేసిన త్యాగమని తెలుసుకుని.. రవి(అల్లరి నరేష్ ) కోసం పల్లెటూరి బాటపట్టడం వంటి మహర్షి ప్రయాణంలో లెక్కకు మించిన మెస్సేజ్ లు కనబడతాయి. స్టూడెంట్ పాత్రలోనూ, రైతు సమస్యలు తీర్చే విషయంలోనూ బలమైన సోషల్ మెస్సేజ్ ఇచ్చిన వంశి.. సినిమా అంతా మెస్సేజ్ లతో నింపేసాడనిపిస్తుంది. సినిమాలో కామెడీ పండింది, ఎమోషనల్ గా టచ్ చేసింది... కానీ ఈ అనవసరమైన మెస్సేజ్ ల వలన సినిమా అంతా ప్రేక్షకుడు మెస్సేజ్ లను చూసుకోవడానికి సరిపోయినట్టుగా అనిపిస్తుంది.

ఇక మహర్షి నిడివి మరీ ఎక్కువవడంతో ప్రేక్షకుడు కాస్త భారంగా సీటులో కూర్చోవాల్సిన పరిస్థితి. ఇక ఈ సినిమాలో కాలేజ్ బ్యాగ్ డ్రాప్ లో త్రీ ఇడియట్స్ సినిమా, రైతు సమస్యలప్పుడు శ్రీమంతుడు సినిమా, మీడియా స్పీచ్ అప్పుడు భరత్ అనే నేను.. ఇలా చాలా సినిమాల పోలికలు మహర్షిలో కనిపిస్తుండడం కూడా ప్రేక్షకుడికి మింగుడు పడవు. మరి వంశి పైడిపల్లి, మహేష్ ని రిచ్ గా, స్టైలిష్ గా చూపించినా ఎక్కడో ఏదో లోటు మహర్షిలో కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది.



By May 10, 2019 at 10:05AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45875/mahesh-babu.html

No comments