Breaking News

విజయ్.. 2 నిమిషాల భారీ లిప్‌లాక్‌ ఎవరితో?


టాలీవుడ్‌లో మణిరత్నం దర్శకత్వంలో నాగార్జున నటించిన ‘గీతాంజలి’ చిత్రంలో ముద్దు సీన్లతోనే పాటంతా చిత్రీకరించడం నాడు ఒక సంచలనంగా మారి అందరు వింతగా చెప్పుకున్నారు. ఆ తర్వాత పెద్దగా లిప్‌లాక్‌లను కొందరుతీసినా అవి నామ్‌కే వాస్తే అన్నట్లుగా మాత్రమే ఉన్నాయి కానీ భారీ అదరచుంభనాలు రాలేదు. ఆ లోటును రౌడీస్టార్‌, టాలీవుడ్‌ సెన్సేషనల్‌ స్టార్‌గానే కాదు... టాలీవుడ్‌ ఇమ్రాన్‌హష్మిగా పేరొందిన విజయ్‌ దేవరకొండ కూడా బాగా ఫాలో అవుతున్నాడు. తన నుంచి ప్రేక్షకులందరు ముక్తకంఠంతో అదరచుంభనాలు కోరేలా చేసుకోవడమే కాదు.. ఆయన నటించిన చిత్రాలలో అలాంటి సీన్స్‌ లేకపోతే ప్రేక్షకులు ఒప్పుకోలేరనే విధంగా ఆయన ఎడాపెడా టాలీవుడ్‌ తెరపై ముద్దుల మోత మోగిస్తూ ముద్దుల ప్రియుడుగా మారిపోయాడు. 

ఇక తాజాగా ఆయన మరోసారి రష్మిక మందన్నతో కలిసి నటిస్తున్న ‘డియర్‌కామ్రేడ్‌’ టీజర్‌ మొత్తానికి ఆయన రష్మికాకి ఇచ్చిన లిప్‌లాకే అదరగొట్టి సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా మారింది. ఇక ఫీల్‌గుడ్‌ చిత్రాలు తీస్తాడనే పేరున్న క్రాంతిమాధవ్‌ సైతం పాపం విజయ్‌కి ఉన్న క్రేజ్‌ చూసి అలాంటి సీన్‌ పెట్టక తప్పలేదట. కె.యస్‌. రామారావు నిర్మాతగా విజయ్‌ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ఏకంగా రెండు నిమిషాల భారీ లిప్‌లాక్‌ హాలీవుడ్‌ రేంజ్‌లో ఉండనుందని సమాచారం. ఇందులో నలుగురైదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. మరి వారిలో విజయ్‌ దేవరకొండ నుంచి లిప్‌ గిఫ్ట్‌ని తీసుకునే హీరోయిన్‌ ఎవరా? అనే అనుమానం వస్తోంది. ఇది రాశిఖన్నాతో ఉంటుందని టాలీవుడ్‌ వర్గాల సమాచారం. 

ఇక ‘డియర్‌కామ్రేడ్‌’ చిత్రం ఈనెల 31న విడుదలవుతుందని భావించినా పలువురిలో మాత్రం విడుదల తేదీపై పలు అనుమానాలు ఉన్నాయి. చివరకు అనుకున్నట్లుగానే ఏకంగా రెండు నెలల గ్యాప్‌ తీసుకుని జులై 26న ఈ చిత్రం విడుదల అవుతుందని మైత్రి మూవీస్‌తో పాటు బిగ్‌బెన్‌ సంస్థ అఫీషియల్‌గా అనౌన్స్‌ చేసింది. ఇక ఈరోజు విజయ్‌ పుట్టినరోజు కావడంతో సౌత్‌లోని పలు నగరాల్లో ఎండ వేడిని తట్టుకునేలా విజయ్‌ పేరు మీద ఓ ప్రముఖ ఐస్‌క్రీమ్‌ కంపెనీ హిమక్రీములను పంచనుంది. గతంలో బర్త్‌డేకి కేవలం హైదరాబాద్‌లో ఈ ప్రయోగం చేసిన రౌడీస్టార్‌ ఈసారి తన ఇమేజ్‌కి తగ్గట్లు, తన రాబోయే చిత్రాలు దక్షిణాదిలోని అన్ని భాషల్లో విడుదల కానుండటంతో దక్షిణాది వ్యాప్తంగా ఈ స్కీమ్‌ని అమలు చేయనున్నాడు. 



By May 10, 2019 at 10:18AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45876/vijay-deverakonda.html

No comments