Breaking News

జర్నలిజం లోతులను స్పృశించగలదా?


తెలుగులో జర్నలిజం బ్యాక్‌డ్రాప్‌లో గొప్ప చిత్రాలేమీ రాలేదు. ఎన్నో ఏళ్ల కిందట మలయాళంలో మమ్ముట్టి నటించిన ‘న్యూఢిల్లీ టైమ్స్‌’కి రీమేక్‌గా తెలుగులో కృష్ణంరాజు, సుమలత, రంగనాథ్‌, ప్రభాకర్‌రెడ్డి, విష్ణువర్ధన్‌(హీరో ప్రశాంత్‌ తండ్రి), సురేష్‌గోపి తదితరులతో జోషీ దర్శకత్వంలో ‘అంతిమతీర్పు’ చిత్రం వచ్చి అద్భుత విజయం సాధించింది. ఆ చిత్రం చూసి థ్రిల్‌, ఎమోషన్‌గా ఫీల్‌గానీ ప్రేక్షకుడు లేడు. ఆ తర్వాత ఇదే చిత్రం బాలీవుడ్‌లోకి కూడా రీమేక్‌ అయింది. ఇక 2011లో కెవి ఆనంద్‌ దర్శకత్వంలో కోలీవుడ్‌లో జీవా హీరోగా ‘రంగం’ చిత్రం జర్నలిజం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చి విజయం సాధించింది. ఈ చిత్రం తెలుగులోకి డబ్‌ అయి ఇక్కడ కూడా అనూహ్యమైన విజయం సాధించింది. డైెరెక్టర్‌ కెవి ఆనంద్‌కి జర్నలిజంలో ఉన్న అనుభవం ఈ చిత్రానికి ఎంతో ఉపయోగపడిందనే చెప్పాలి. 

ఇక తెలుగులో మాత్రం ఈ దిశగా సిన్సియర్‌ ప్రయత్నం ఇప్పటివరకు జరగలేదనే చెప్పాలి. ఏదో ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’ వంటివి వచ్చినా అందులో హీరోయిజం చూపిస్తూ, రొటీన్‌ కమర్షియల్‌ జోనర్‌లో తీశారు తప్ప జర్నలిజంలోని లోతులను, అందులోని కష్టనష్టాలు, ప్రాణాలకు ఎదురొడ్డి జర్నలిస్ట్‌లు తమ వృత్తిపరంగా చేసే సాహసాలను చూపించలేకపోయారు. నేటి రోజుల్లో ప్రతి ఒక్కరు మీడియాను, జర్నలిస్ట్‌లను తప్పు పట్టేవారే గానీ ఆ వృత్తి వెనుకుండే కష్టనష్టాలు, ఎత్తుపల్లాలు, జర్నలిజంలో వస్తున్న మార్పులు, యాజమాన్య పద్దతులు, జర్నలిస్ట్‌ల వెతలు చూపించే సాహసం చేయడం లేదు. కానీ ఇప్పుడు నిఖిల్‌ చేస్తోన్న ‘అర్జున్‌ సురవరం’లో జర్నలిజంలోనే అత్యంత క్లిష్టమైన ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిజంని తెరపై చూపించనున్నారని తెలుస్తోంది. దాంతో ఈ చిత్రాన్ని ఎలా తీశారు? ఎంత లోతుగా వాస్తవాలను చూపించారు? అనే ఆసక్తి కలుగుతోంది. 

ఇక ఇటీవల పరభాషా చిత్రాలను తెలుగులోకి రీమేక్‌ చేసేటప్పుడు సినిమాని ఓ ఆత్మను పట్టి చూపించేందుకు గాను తెలుగు దర్శకులను కాకుండా ఒరిజినల్‌ వెర్షన్‌ దర్శకులనే ఎంచుకుంటున్నారు. ‘యూటర్న్‌’ నుంచి ‘96’ వరకు ఇదే జరుగుతోంది. ఇక ‘అర్జున్‌ సురవరం’ను కూడా తమిళ ‘కణితన్‌’ని తీసిన సంతోష్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘బ్యాంగ్‌ బ్యాంగ్‌’ అనే లిరికల్‌ సాంగ్‌ విడుదలై మంచి స్పందన రాబట్టుకుంటోంది. మరి ‘కిర్రాక్‌పార్టీ’ రీమేక్‌తో హిట్టుకొట్టలేకపోయిన నిఖిల్‌ ‘అర్జున్‌ సురవరం’తోనైనా మంచి విజయం సాధిస్తాడో లేదో వేచిచూడాల్సివుంది....!



By May 08, 2019 at 10:51AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45853/nikhil.html

No comments