Breaking News

క్రిష్‌ కెరీర్‌కే అది అతి పెద్ద ప్రమాదమిది!


తన మొదటి చిత్రం ‘గమ్యం’ నుంచి ‘వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి పలు చిత్రాల ద్వారా మంచి క్రియేటివిటీ ఉన్న దర్శకునిగా పేరు తెచ్చుకున్నాడు క్రిష్‌. ఆయన చిత్రాలకంటూ ఓ వర్గం ప్రేక్షకులను సంపాదించుకున్నాడు. ఇలా హిట్స్‌, ఫ్లాప్స్‌లతో సంబంధం లేకుండా ఆయన సాధించుకున్న ఇమేజ్‌ మొత్తం ‘మణికర్ణిక’ వివాదం, తెలుగులో బాలయ్య తీసిన ఎన్టీఆర్‌ బయోపిక్స్‌ ‘కథానాయకుడు, మహానాయకుడు’ ద్వారా గంగలో కలిపేసుకున్నాడు. ఈమూడు చిత్రాల విషయంలో క్రిష్‌పై వచ్చిన విమర్శలు ఎంతో ఘాటుగా ఉన్నాయి. 

దాంతో ప్రస్తుతం క్రిష్‌ భవితవ్యం ఇబ్బందుల్లో ఉంది. ఇలాంటి సమయంలో క్రిష్‌తో పనిచేసేందుకు పెద్దగా హీరోలు ఆసక్తి చూపడం లేదు. దాంతో తన సొంత బేనర్‌ అయిన ఫస్ట్‌ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో అంతా కొత్తవారితో క్రిష్‌ ఓ చిత్రం చేయనున్నాడని వార్తలు వచ్చాయి. తాజాగా క్రిష్‌కి ఊరట కలిగించే మరో విషయం బయటకు వచ్చింది. గతంలో క్రిష్‌ తమిళంలో ‘రమణ’( తెలుగులో ‘ఠాగూర్‌’)ని బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్‌ హీరోగా ‘గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌’గా తీసి మంచి హిట్టుని సాధించాడు. తాజాగా ఈయన మరో కథను అక్షయ్‌కుమార్‌కి చెప్పాడట. ఈ చిత్రం కథ విన్న అక్షయ్‌ కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నాడని తెలుస్తోంది. త్వరలోనే అక్షయ్‌ నుంచి క్రిష్‌కి గ్రీన్‌సిగ్నల్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయని బిటౌన్‌ వర్గాలు అంటున్నాయి. 

మొత్తానికి ఈ ప్రాజెక్ట్‌ ఓకే అయినట్లే ఉందని తెలుస్తోంది. ఇదే జరిగితే క్రిష్‌ తన మకాంను ముంబైకి మార్చివేయడం ఖాయమంటున్నారు. ‘మణికర్ణిక, కథానాయకుడు, మహానాయకుడు’ల తర్వాత క్రిష్‌ ఖిలాడీ అక్షయ్‌కుమార్‌ సినిమాని హిట్‌ చేయక తప్పని పరిస్థితి ఉంది. ఫలితం తేడా వస్తే క్రిష్‌ కెరీర్‌కే అది అతి పెద్ద ప్రమాదం. మరి ఈ డూ ఆర్‌ డై విషయంలో క్రిష్‌ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించి హిట్‌ సాధించడం అతి ముఖ్యమనే చెప్పాలి.



By May 08, 2019 at 10:32AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45852/director-krish.html

No comments