Breaking News

సాధించింది, కోల్పోయింది ఏం లేదు: ఛార్మి


చాలా తక్కువ సినిమాలే చేసి యంగ్ ఏజ్ లోనే తన నటనకు గుడ్ బై చెప్పింది ఛార్మి కౌర్. వయసు మళ్ళిన హీరోయిన్స్ ఇంకా సినిమాలు చేస్తుంటే ఛార్మి మాత్రం నటనకు బాయ్ చెప్పి డైరెక్టర్ పూరితో కలిసి సినిమాలు నిర్మిస్తోంది. ఆయన డైరెక్ట్ చేసే సినిమాలు, ప్రొడ్యూస్ చేసే సినిమాల్లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వర్క్ చేస్తుంది.  ఒకరకంగా చెప్పాలంటే పూరి సినిమా నిర్మాణ బాధ్యతలు అన్ని ఛార్మినే చూసుకుంటుంది.

నటన పరంగా మీకు అవకాశాలు తగ్గిపోయాయి కదా అని అడిగితే అలాంటిదేమీ లేదంటోంది ఛార్మి.  తనకి ఇప్పటికి ఇంకా సినిమా ఛాన్సులు వస్తున్నాయి అని, దాదాపు ప్రతి రోజు ఏదొక సినిమాల్లో ఫలానా పాత్ర ఉంది, ఫలానా హీరోయిన్ ఛాన్స్ ఉంది చేస్తారా? అని ఛాన్సులు వస్తూనే ఉన్నాయని ఛార్మి చెప్పడం విశేషం. నా 13వ ఏటనే నటన మొదలుపెట్టానని.. అప్పట్నుంచి దశాబ్దంన్నర పాటు విరామం లేకుండా నటించానని.. యాక్టింగ్ లో ఎత్తులు పల్లాలు చూశానని... పెద్దపెద్ద హీరోస్ తో వర్క్ చేసానని... తాను సాధించనిది, కోల్పోయినది అంటూ ఏమీ లేదని చాలా సంతోషంగా యాక్టింగ్ కు గుడ్ బై చెప్పేశానని ఛార్మి చెప్పింది.

ప్రస్తుతం పూరి డైరెక్ట్ చేసే సినిమాల బాధ్యతలు అన్ని తానే చూసుకుంటున్న. నిర్మాతగా చాలా పెద్ద బాధ్యతను మోస్తున్నానని.. ఈ బాధ్యతను ఆస్వాదిస్తున్నానని... పూరి తనకు బాస్ లాంటి వాడని చెప్పింది. భవిష్యత్తులో ‘పూరి కనెక్ట్స్’ చాలా పెద్ద స్థాయికి చేరుకుంటుందని ఆమె అంది. ప్రస్తుతం ఈ బ్యానర్ లో రామ్ ఇస్మార్ట్ శంకర్ రూపొందుతుంది.



By May 18, 2019 at 03:05AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45967/charmi.html

No comments