Breaking News

ఇదీ న్యూస్.. ఇప్పుడు ఎగరేయండి.. కాలర్!


ప్రస్తుతం మహేష్ బాబు ‘మహర్షి’ సినిమా విజయంతో పార్టీల మీది పార్టీలు చేసుకోవడమే కాదు.. సినిమాని కూడా తెగ ప్రమోట్ చేస్తున్నాడు. 25వ సినిమా హిట్ అవడంతో మహేష్ బాబు గాల్లో తేలుతున్నాడు. మహేష్ అభిమానులు కూడా మహర్షి సినిమా విజయంతో హ్యాపీగా ఉన్నారు. ఇక మహేష్ బాబు ఎంత అందగాడో అనేది ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం. వయసు పెరిగే కొద్దీ అందం తరుగుతుంది అంటారు కానీ... మహేష్ అందం మాత్రం చెక్కుచెదరడం లేదు. అలాంటి అందగాడికి ఇప్పుడు మహర్షి విజయంతో పాటుగా మరో గుడ్ న్యూస్‌తో కూడా ఎంజాయ్ చేస్తున్నాడు.

ఎప్పుడు బాలీవుడ్ హీరోస్‌కి మాత్రమే సొంతమయ్యే మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్‌లో ఈసారి మహేష్ కూడా చోటు సంపాదించాడు. ప్రతిష్టాత్మక టైమ్స్ మ్యాగజైన్ ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా యూత్‌లో ఆయా హీరోలకు ఉన్న పాపులారిటీ ఆధారంగా ర్యాంక్స్ ఇస్తుంది. అలా ఎప్పటినుండో బాలీవుడ్ హీరోలైన సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి వాళ్ళకే చోటు దక్కేది. కానీ ఇప్పుడు మొట్టమొదటిసారిగా సౌత్ నుండి మహేష్ బాబుని మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్‌లో చేర్చారు. మరి సౌత్ నుండి మొట్టమొదటిసారిగా ఈ 2019 లో మహేష్ బాబే మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ చోటు సంపాదించడం మహేష్ అభిమానులకే కాదు.. సౌత్ ప్రేక్షకులు గర్వంగా ఫీల్ కావాల్సిన విషయమే. 



By May 18, 2019 at 10:53AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45978/mahesh-babu.html

No comments