Breaking News

బాలయ్య ఆ టైటిల్‌కి ఎలా ఒప్పుకున్నాడు....! 


నందమూరి బాలకృష్ణ. ఇతనిదో ప్రత్యేక మనస్తత్వం, అభిమానులను కొట్టడం నుంచి మీడియా వారిని తిట్టడం వరకు ఈయన రూటే వేరు. కోపం వచ్చిందంటే ఏం చేస్తున్నాను అని కూడా ఆలోచించడు. నాడు బెల్లంకొండ సురేష్‌ ఘటనలో కూడా కాకర్లసుబ్బారావు పుణ్యమా అని మానసికంగా సరిగా లేడని సర్టిఫికేట్‌ తెచ్చుకుని బయటపడ్డాడు. ఇక ఈయన గురించి చెప్పాలంటే చాలా ఉంది. నేను తాను నటించిన చిత్రాలు, తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్‌ చిత్రాలు మాత్రమే చూస్తానంటాడు. షూటింగ్‌ గ్యాప్‌లో కూడా తాను నటించిన చిత్రాల గురించి, తన తండ్రి చిత్రాలు గురించే సోది చెబుతుంటాడనే విమర్శలు ఉన్నాయి. ఇక ఈయన సినిమాలలో ఉండే బిల్డప్‌ సామాన్యంగా ఉండదు. ఎప్పుడు నా తండ్రి, నా వంశం అంటూ ఉంటాడు. 

ఇక కంటిచూపుతో రైళ్లని ఆపేయడం, కుందేలు కోసం కొండలు ఎక్కడం.. ఇలా భీభత్సమైన కామెడీ ఉంటుంది. తన చిత్రాలకు కూడా పవర్‌ఫుల్‌ టైటిల్స్‌ని పెట్టుకుంటూ ఉంటాడు. కేవలం బాలయ్యని సినిమాకి ఒప్పించాలంటే నాలుగైదు పవర్‌ఫుల్‌ డైలాగ్‌లు, అంతే పవర్‌ఫుల్‌ టైటిల్‌.. నాలుగైదు యాక్షన్‌ సీన్స్‌ని చెబితే చాలు అంటూ ఉంటారు. ఇక ఈయనకు ప్రస్తుతం జూనియర్‌ ఎన్టీఆర్‌తో సాన్నిహిత్యం లేదు. ఎప్పుడో కలుసుకున్నా, పెద్దగా ఇద్దరు కలిసినట్లుగా బాబాయ్‌, అబ్బాయ్‌ల రిలేషన్‌ కనిపించదు. మరి అలాంటి బాలయ్య, జూనియర్‌ ఎన్టీఆర్‌ టైటిల్‌ని వాడుకోవడం ఏమిటి? అనే చర్చ నడుస్తోంది. 

ప్రస్తుతం బాలయ్య తమిళ సీనియర్‌ దర్శకుడు కె.యస్‌.రవికుమార్‌ చిత్రంలో నటించనున్నాడు. దీనికి ‘రూలర్‌’ అనే పవర్‌ఫుల్‌ టైటిల్‌ని పెట్టాలని యోచిస్తున్నారు. కానీ ‘రూలర్‌’ అనేది బోయపాటి శ్రీను దర్శకత్వంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన ‘దమ్ము’ చిత్రంలోనిది. ఈ చిత్రంలోని ఆ పాట పవర్‌ఫుల్‌గా సాగుతుంది. చిత్రీకరణ కూడా భారీగా పవర్‌ఫుల్‌గానే ఉంటుంది. సినిమా ఫ్లాప్‌ అయినా ‘రూలర్‌’ అనే పదం వింటేనే మనకు జూనియర్‌ పాట గుర్తుకు వస్తుంది. ఇతర హీరోల చిత్రాలను చూడను అని చెప్పిన బాలయ్య బహుశా ‘దమ్ము’ చిత్రం చూసి ఉండకపోవచ్చనే వ్యంగ్యాస్త్రాలు వస్తున్నాయి. 



By May 16, 2019 at 10:51AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45950/balakrishna.html

No comments