Breaking News

మరో సీనియర్ హీరోతో బుక్కయ్యిందట!


ఆర్‌ఎక్స్‌ 100 లాంటి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ తో తెలుగు తెరకు పరిచయం అయిన పాయల్‌ రాజ్‌పుత్  సుడి మారిపోయింది అనుకున్నారు అంత. మొదటి సినిమాతోనే సక్సెస్ తో పాటు యూత్ ఫాలోయింగ్ పెంచుకున్న పాయల్ కు ఆర్‌ఎక్స్‌ 100 తరువాత పెద్ద అవకాశాలు రాలేదు. బోల్డ్‌ క్యారెక్టర్‌ చేసినా కానీ యూత్‌ సినిమాలకి ఆమెని ఎవరూ సంప్రదించడం లేదు.

రీసెంట్ గా వెంకీమామ సినిమాలో వెంకీకి జోడిగా ఛాన్స్ కొట్టేసింది. నాగార్జున  ‘మన్మథుడు 2’లో కూడా హీరోయిన్ సెలెక్ట్ అవుతుంది అనుకున్న టైములో ఆమె ప్లేస్ లో రకుల్ వచ్చి డేట్స్ ఇవ్వడంతో ఈమెకు ఆ లక్కీ ఛాన్స్ పోయింది. ఇప్పుడు లేటెస్ట్ గా ఫిఫ్టీ ప్లస్‌ హీరో రవితేజతో కూడా పాయల్‌ ‘డిస్కో రాజా’ చేస్తోంది. 

అలానే సీనియర్ హీరో బాలకృష్ణ సినిమాలో కూడా పాయల్ హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. కె.ఎస్‌. రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మరో హీరోయిన్‌ కూడా వుంటుంది కానీ ఒక హీరోయిన్‌ రోల్‌ అయితే పాయల్‌కి బుక్‌ అయింది. యంగ్ హీరోస్ తో చేయాల్సిన పాయల్ ఇలా సీనియర్ హీరోస్ తో చేయడం కొంచెం ఆశర్యం కలిగించే విషయమే. తేజ డైరెక్షన్ లో వస్తున్న సీత అనే సినిమాలో ఐటెమ్‌ గాళ్‌గా మాత్రం కనిపిస్తోంది. యూత్ ఫుల్ చిత్రంతో పరిచయం అయిన పాయల్ కు యంగ్ హీరోతో చేసే ఛాన్స్ ఎందుకు రావడంలేదు అర్ధం కానీ విషయం.



By May 16, 2019 at 11:07AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45952/payal-rajput.html

No comments