Breaking News

రూమర్స్ దెబ్బకి చేయనని చెప్పేసింది..!


వరుణ్ తేజ్ తొలిసారిగా వాల్మీకి అనే సినిమాలో నెగెటివ్‌ రోల్ చేస్తున్నాడు. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఓ కీలకపాత్ర కోసం పూజా హెగ్డే అనుకున్నారు మేకర్స్. గతంలో వరుణ్ తో పూజా ముకుంద చిత్రంలో కలిసి నటించింది. అలానే హరీష్ శంకర్ గత చిత్రం డిజె లో పూజానే హీరోయిన్ కావడంతో ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఓకే చెప్పింది.

అయితే గత కొన్ని రోజులునుండి పూజాపై మీడియాలో రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. ఆమె లేటెస్ట్ గా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిందని... చిన్న సినిమాలకు ఎక్కువ పారితోషికం డిమాండ్‌ చేస్తోందంటూ వార్తలు వచ్చాయి. స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్న టైములో ఇటువంటి రూమర్స్ రావడం కామన్ అని అనుకుని ఇకపై పెద్ద సినిమాలే చేయాలనీ డిసైడ్ అయింది.

చిన్న సినిమాలు చేస్తే తనపై మనీ మైండెడ్‌ అనే ముద్ర వేసేస్తున్నారని వాల్మీకి నుండి తప్పుకుంది. ఇప్పుడు ఈ అమ్మడు ప్లేస్ లో మరో హీరోయిన్ ని వెతికే పనిలో ఉన్నారు హరీష్ శంకర్. ఏదిఏమైనా ఈ రూమర్స్ పూజాని బాగా ఎఫెక్ట్ చేసాయి.



By May 16, 2019 at 11:40AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45956/pooja-hegde.html

No comments