Breaking News

అందుకే అఖిల్ మూవీ ఆలస్యం అవుతోంది!


లైన్స్ చెప్పి మన హీరోస్ ని ఇంప్రెస్స్ చేసే మన డైరెక్టర్స్ చాలామంది ప్రస్తుతం సెకండ్ హాఫ్ ను డీల్ చేసే విషయం ఫెయిల్ అవుతున్నారు. స్క్రిప్టు వ‌ర‌కూ వ‌చ్చేస‌రికి చేతులు ఎత్తేస్తున్నారు. సెకండ్ హాఫ్ దగ్గర ఏమి చేయలేకపోతున్నారు. ప్రస్తుతం అటువంటి పరిస్థితే ఎదురుకుంటున్నాడు శ్రీకాంత్ అడ్డాల.

గీత ఆర్ట్స్ లో ఎప్పుడో అడ్వాన్స్ తీసుకున్న శ్రీకాంత్ ఇంకా సెకండ్ హాఫ్ ని అల్లే పనిలో ఉన్నాడు. అలానే బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ కూడా. అఖిల్ - బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ కాంబినేష‌న్‌లో గీతా ఆర్ట్స్ ఓ సినిమా సెట్ అయిన సంగతి తెలిసిందే. ఈపాటికే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్ళాలి కానీ ఇంకా స్టోరీ రెడీ అవ్వకపోవడంతో హోల్డ్ లో ఉంది.

సెకండ్ హాఫ్ విషయం డైరెక్టర్ భాస్కర్ ఇంకా ఓ క్లారిటీ రాలేద‌ని తెలుస్తోంది. ఇద్దరుముగ్గురు రైటర్స్ ని కూర్చోబెట్టినా సెకండాఫ్ తేల‌డం లేద‌ని టాక్‌. కరెక్ట్ గా ఇంటర్వెల్ దగ్గరనుండి ప్రీ క్లైమాక్స్ ముందు వరకు సరిగా డీల్ చేయలేకపోతున్నాడని టాక్. అయితే ఈలోపో  ‘ముందు చేతిలో ఉన్న సీన్లు తీసేద్దాం’ అని భాస్క‌ర్ తొంద‌ర‌ప‌డుతున్నా… అల్లు అర‌వింద్ మాత్రం ‘కాంగారేం లేదు. స్క్రిప్టు పూర్తిగా సిద్ధ‌మ‌య్యాకే మొదలెడదాం’ అంటున్నాడ‌ట‌. సో అందుకే భాస్కర్ సెకండ్ హాఫ్ పై కుస్తీలు పడుతున్నాడు. మరి ఇది ఎప్పటికి తేలేను అండ్ సెట్స్ మీదకు ఎప్పుడు వెళ్ళేను..



By May 18, 2019 at 08:02AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45972/akhil-akkineni.html

No comments