Breaking News

జూన్ ప్రథమార్థంలో ‘మళ్ళీ మళ్ళీ..’!


అనురాగ్ కొణిదెన హీరోగా శ్వేత అవస్తి, కైరవి తక్కర్ హీరోయిన్లుగా హేమంత్ కార్తీక్ దర్శకత్వంలో క్రిషి క్రియేషన్స్ పతాకంపై కె. కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ‘మళ్ళీ మళ్ళీ చూశా’.. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.. 

ఈ సందర్భంగా దర్శకుడు  హేమంత్ కార్తీక్ మాట్లాడుతూ.. స్వేచ్ఛలేని జీవితం అంటే శత్రువు లేని యుద్ధం లాంటిది. ఈ సమాజంలోని ప్రతి ప్రేమికుడు, సమరంలో ఒక సైనికుడితో సమానం. స్వచ్ఛమైన ప్రేమను ఆ ప్రేమే గెలిపించుకుంటుంది. శత్రువులు లేని యుద్ధంలో స్వేచ్ఛగా ప్రేమను గెలిచిన సైనికుడులాంటి ఓ సామాన్యుడి ప్రేమకథ ‘మళ్ళీ మళ్ళీ చూశా’ అని అన్నారు. 

నిర్మాత  కె. కోటేశ్వరరావు  మాట్లాడుతూ... ఒక మంచి పుస్తకం, ఒక మంచి స్నేహితుడితో సమానం. మా సినిమా కూడా చూసినోళ్లందరికి ఒక మంచి ఫ్రెండ్ అవుతుంది. జీవితం సంతోషంగా ఉండాలంటే మన ఆలోచనలు అందంగా ఉండాలి. అలాంటి అందమైన ఆలోచనల సమూహమే మా సినిమా. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగించుకుని త్వరలో ఆడియో, జూన్ ప్రథమార్థంలో  సినిమా విడుదల చేయబోతున్నాం అన్నారు..

అన్నపూర్ణమ్మ, అజయ్, మధుమణి, ప్రభాకర్, టి.ఎన్. ఆర్, మిర్చి కిరణ్, కరణ్, బాషా, ప్రమోద్, పావని, జయలక్మి, మాస్టర్ రామ్ తేజస్, బంచిక్ బబ్లూ, తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి రచన,దర్శకత్వం : హేమంత్ కార్తీక్ , నిర్మాత : కె. కోటేశ్వరరావు, సంగీతం శ్రవణ్ భరద్వాజ్, సినిమాటోగ్రఫీ సతీష్ ముత్యాల, ఎడిటర్ సత్య గిడుతూరి, లిరిక్స్ తిరుపతి జావాన, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాయి సతీష్ పాలకుర్తి.



By May 19, 2019 at 10:05AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45987/malli-malli-choosa.html

No comments