Breaking News

మహేష్‌ 26 ముహూర్తం ఖరారు!


నిన్నటిదాకా మహేష్‌ బాబు తన సొంత చిత్రాలకు కూడా చేయని విధంగా తన ప్రతిష్టాత్మక 25వ చిత్రం ‘మహర్షి’కి అగ్రెసివ్‌గా ప్రమోషన్‌ చేశాడు. ఈ ప్రమోషన్స్‌లో ఈ చిత్రం సాధిస్తున్న విజయం చూసి బాగా సెన్సిటివ్‌గా కూడా మారిపోయాడు. ఎన్నడు లేని విధంగా రెండుసార్లు కాలర్‌ ఎగురవేశాడు. తాజాగా ఆయన ‘మహర్షి’ ప్రమోషన్స్‌ నుంచి గ్యాప్‌ తీసుకుని ఫ్యామిలీతో సహా 25ల విదేశీ వెకేషన్స్‌కి వెళ్లాడు. ‘మహర్షి’ షూటింగ్‌ పూర్తయిన సందర్భంగా కూడా ఆయన వెకేషన్స్‌ ఎంజాయ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇక హీరో లేని ప్రమోషన్స్‌కి ఎవ్వరూ పెద్దగా కనెక్ట్‌ కారు. మరి మహేష్‌ లేని లోటును పూడుస్తూ ఈ యూనిట్‌ మరో రెండు వారాల పాటు ప్రమోషన్స్‌ జరపాల్సివుంది. 

ఇక మహేష్‌ విషయానికి వస్తే ఆయన నటించే 26వ చిత్రం ఖరారైపోయింది. ఎఫ్‌2 వంటి బ్లాక్‌బస్టర్‌ ఇచ్చిన అనిల్‌రావిపూడితో, మహేష్‌ చిత్రం చేయనున్నాడు. ఇప్పటివరకు అనిల్‌రావిపూడి మహేష్‌ స్థాయి స్టార్‌తో పనిచేయలేదు. కానీ తాను తీసిన చిత్రాలతో అపజయం ఎరుగని దర్శకునిగా పేరు తెచ్చుకున్న అనిల్‌కి ఇది క్లిష్టమైన టాస్క్‌ అనే చెప్పాలి. ఇక ఈ చిత్రకథ గ్రామీణ నేపపధ్యంలో సాగుతుందని అంటున్నారు. బైండేడ్‌ స్క్రిప్ట్‌ కోసం అనిల్‌రావిపూడి అహర్నిశలు కష్టపడుతున్నాడు. ఎలాంటి మేసేజ్‌లు లేకుండా ఎంటర్‌టైనింగ్‌గా సాగే ఓ పక్కా క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉండనుంది. 

ఇక ఈ మూవీని మహేష్‌ తండ్రి సూపర్‌స్టార్‌ కృష్ణ జన్మదినం అయిన మే31న ప్రారంభించనున్నారు. తన తండ్రి బర్త్‌డే కంటే మహేష్‌కి మంచి ముహూర్తం ఏముంటుంది? అయితే మహేష్‌ ఈ చిత్రం పూజా కార్యక్రమాలకు హాజరుకావడం లేదు. సాధారణంగా మహేష్‌ తన చిత్రం పూజా కార్యక్రమాలు హాజరుకాడు. అదో సెంటిమెంట్‌గా ఆయన భావిస్తూ ఉంటాడు. కాబట్టి మే31న పూజా కార్యక్రమాలు జరిపి జూన్‌ నెలాఖరులో రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించనున్నారట. ఇక మహేష్‌ ఎవరైనా దర్శకుడితో పనిచేసి పనితనం నచ్చితే రెండో చాన్స్‌ వెంటనే ఇస్తాడు. గతంలో గుణశేఖర్‌ ‘ఒక్కడు’ తర్వాత ‘సైనికుడు’, పూరీ జగన్నాథ్‌తో ‘పోకిరి’ తర్వాత కథను కూడా వినకుండా ‘బిజినెస్‌మేన్‌’, శ్రీకాంత్‌ అడ్డాలతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు, బ్రహ్మూెత్సవం’ వంటి ఎన్నో చిత్రాలు ఉన్నాయి. కానీ రెండోసారి రిపీట్‌ చేసిన దర్శకులు కొందరు మహేష్‌కి డిజాస్టర్స్‌ ఇచ్చారు. మరోవైపు మహేష్‌ కోసం సుకుమార్‌, పరుశురాం, సందీప్‌రెడ్డి వంగా, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ వంటి భారీ క్యూ కనిపిస్తోంది. మరి మహర్షి తీసిన వంశీపైడిపల్లికి కూడా మహేష్‌ ఈ రోజు కాకపోతే కాస్త ఆలస్యంగానైనా మరో చాన్స్‌ ఇస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి.



By May 23, 2019 at 08:34AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/46049/mahesh-babu.html

No comments