Breaking News

ద్వితీయ విఘ్నం విజయవంతంగా బీట్ చేశారు


మన తెలుగులో ద్వితీయ విఘ్నం అనేది కొత్త దర్శకులను బాగా ఇబ్బందులు పెడుతుంది. తేజ నుంచి ‘తొలిప్రేమ’ కరుణాకరన్‌ వరకు, మరలా ‘తొలిప్రేమ’ వెంకీ అట్లూరి నుంచి ‘మిస్టర్‌మజ్ను’ ఇలా ఎందరినో ఉదాహరణగా చెప్పవచ్చు. కానీ రాజమౌళి నుంచి శివకొరటాల, అనిల్‌రావిపూడి వరకు దానిని తప్పు అని నిరూపించారు కానీ ఈసారి మాత్రం ఇద్దరు యంగ్‌ డైరెక్టర్స్‌ ఒకే నెలలో ఎమోషన్స్‌తో ఆటాడుకుని ఆ గండాన్ని దాటి వచ్చారు. వారిద్దరే శివనిర్వాణ, గౌతమ్‌ తిన్ననూరు. 

శివనిర్వాణ విషయానికి వస్తే ఆయన మొదటి చిత్రం రెండేళ్ల కిందట వచ్చిన ‘నిన్నుకోరి’. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. రెండేళ్ల గ్యాప్‌ తీసుకుని ఆయన భార్యాభర్తల ఎమోషన్స్‌ని అద్భుతంగా తీర్చిదిద్ది ‘మజిలీ’ చిత్రం తీసి బ్లాక్‌బస్టర్‌ కొట్టాడు. ఏప్రిల్‌ 5న విడుదలైన ఈ చిత్రం నాగచైతన్యకు పెద్ద ఊరట ఇవ్వడమే కాదు.. ఆయన కెరీర్‌లోనే వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ చిత్రంగా నిలిచేలా సాగుతోంది. ఇక గౌతమ్‌ తిన్ననూరి మొదటి చిత్రం ‘మళ్ళీరావా’ బాగానే టాక్‌ సాధించింది. కానీ హీరోకి ఉన్న మార్కెట్‌, బడ్జెట్‌ పరిమితులు, మార్కెట్‌ పరిధి దృష్ట్యా అందరికీ చేరువ కాలేకపోయాడు. 

కానీ తాజాగా ఆయనకు నేచురల్‌స్టార్‌ నాని భరోసా ఇవ్వడంతో నాని చేత జెర్సీ వేయించి, అద్భుతంగా సినిమాని తీర్చిదిద్దాడు. ఈ ఏడాది ఇప్పటివరకు విడుదలైన చిత్రాలలో 1శాతం కూడా నెగటివ్‌ టాక్‌ లేకుండా మౌత్‌టాక్‌, మంచి రేటింగ్స్‌ని సాధించిన ఈ చిత్రం రాబోయే రోజుల్లో మరెన్ని సంచనాలకు శ్రీకారం చుడుతుందో చూడాలి. ఇక ఈ మూవీని చైనాలో కూడా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇలాంటి ఎమోషనల్‌ బాండింగ్‌ చిత్రాలకు చైనీయులు కనకవర్షం కురిపిస్తారు. మరి ఈ చిత్రం చైనాలో ఎలా ఆడుతుంది? అనే విషయంతోపాటు ఈ చిత్రం రీమేక్‌ కోసం ఇతర భాషల వారు పోటీపడుతున్న తీరు ఈ చిత్రం సత్తాని చాటుతుందని చెప్పాలి. 



By April 22, 2019 at 12:04PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45627/shiva-nirvana.html

No comments