Breaking News

‘సీత’.. మేకి వెళ్లిపోయినట్లే..!


బెల్లంకొండ శ్రీనివాస్ - కాజల్ అగర్వాల్ కాంబో‌లో తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీత’. మహేష్ మహర్షి మే తొమ్మిదికి పోస్ట్ పోన్ కావడంతో.. తమ సీత సినిమాని ఏప్రిల్ 25 న విడుదల అంటూ మేకర్స్ ప్రకటించారు. అయితే మొన్నీమధ్యనే తేజ షూటింగ్ స్పాట్ నుండి అలిగి వెళ్లిపోయాడని, కానీ షూటింగ్ మాత్రం సకాలంలో చేసి అప్పజెబుతానని మేకర్స్ కి తేజ మాటిచ్చాడని అనడమే కాదు.. షూటింగ్ లేట్ అవడంతో సినిమా పోస్ట్ పోన్ అయ్యిందంటూ వార్తలొచ్చాయి. కానీ హడావిడిగా ఉగాది రోజున సీత టీజర్ ని విడుదల చేస్తూ తమ సినిమా ఏప్రిల్ 25 నే విడుదల అంటూ ప్రకటించింది సీత టీం. 

ఇక తాజాగా ప్రీ రిలీజ్ బిజినెస్ అంటూ సీతపై వార్తలు సోషల్ మీడియాలో జోరందుకున్నాయి. మరి విడుదల సమయం దగ్గరపడుతున్న కొద్దీ.. సినిమా ప్రమోషన్స్ ఊపందుకోవాలి. కానీ సీత టీం చడీ చప్పుడు లేదు. మరో పదిరోజుల్లో విడుదల కాబోయే సీత సినిమా ప్రమోషన్స్ ఎప్పుడో స్టార్ట్ కావాలి కానీ.. ఇంతవరకు మొదలవలేదు అంటే.. సీత సినిమా ఏప్రిల్ 25 నుండి వాయిదాపడిందనే న్యూస్ సోషల్ మీడియాలో వినబడుతుంది. 

ఓవర్సీస్ లో సీత కి సరిపడినన్ని థియేటర్స్ దొరకని కారణంగా సీత సినిమాని ఏప్రిల్ 25 నుండి మే 16 కి వాయిదా వేశారనే న్యూస్ నడుస్తుంది. మరి ఓవర్సీస్ లో థియేటర్స్ దొరక్క వాయిదా పడిందా.. లేదంటే వేరే ఏదైనా కారణమా అనేది తెలియాల్సి ఉంది. కానీ సీత సినిమా ప్రమోషన్స్ ఇంకా మొదలవ్వకపోవడానికి కారణం మాత్రం సినిమా వాయిదా పడటమే అంటున్నారు.



By April 18, 2019 at 07:57AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45582/sita.html

No comments