Breaking News

‘బాహుబలి’కి కాదు.. ‘మగధీర’కే ఫిక్సయిందట!


అలియాభట్‌.. ఈ చిన్నది బాలీవుడ్‌లో సంచలనాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా చెప్పాలి. ఆమె కోసం బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్‌, స్టార్‌ హీరోలు క్యూలో నిలబడతారు. ఆమె బాలీవుడ్‌లో ఒక్కో చిత్రానికి తీసుకునే పారితోషికం 10కోట్ల పైమాటే అని ట్రేడ్‌ వర్గాలు అంటూ ఉన్నాయి. ఇక విషయానికి వస్తే ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్‌,రామచరణ్‌లతో తీస్తున్న అసలుసిసలు మల్టీస్టారర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో చరణ్‌ సరసన నటించేందుకు అలియాభట్‌ని ఒప్పించాడు. మరి ఈ చిత్రం ఒప్పుకోవడం వెనుక అలియాభట్‌ని ప్రేరేపించిన విషయాలు ఏమిటి? అనే ఆసక్తికర చర్చ సాగుతోంది. బాలీవుడ్‌లో పది కోట్లకు తక్కువ తీసుకోని అలియా రాజమౌళి చిత్రానికి మాత్రం కేవలం ఐదు కోట్లకే ఒప్పుకుందని సమాచారం. 

ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ కొమరం భీమ్‌, చరణ్‌ అల్లూరి సీతారామరాజుల స్ఫూర్తి పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో ఆమె అల్లూరి సీతారామరాజు పాత్ర స్ఫూర్తితో నటిస్తున్న చరణ్‌కి మరదలు సీత పాత్రలో నటిస్తోంది. ఈ విషయం గురించి తాజాగా అలియాభట్‌ మాట్లాడుతూ, రాజమౌళి చిత్రాన్ని నేను ఒప్పుకున్నానని తెలిసి అందరు ‘బాహుబలి’ని, అది సాధించిన విజయాన్ని చూసి ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నానని భావిస్తారు. కానీ అది నిజం కాదు. 

నేను ఈ సినిమా అంగీకరించడానికి కారణం ‘బాహుబలి’ కాదు.. ‘మగధీర’ మాత్రమే ఈ చిత్రం చూసినప్పటి నుంచి నాకు రాజమౌళి సినిమాలంటే బాగా ఇష్టం ఏర్పడింది. కథ, కథనాలను జనరంజకంగా మలచడంలో రాజమౌళికి ఎవ్వరూ సాటి రారు. అలాంటి ఆయన దర్శకత్వంలో నటించడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో నా పాత్ర ఎంతో కష్టతరమైనది. అయినా బాగా చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చింది. 



By April 15, 2019 at 07:43AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45542/alia-bhatt.html

No comments