Breaking News

జయసుధ చాలా గొప్ప నిర్ణయం తీసుకుంది


నాటితరంలో ఉన్న విలువలు ఈనాడు ప్రజలలోనే కాదు.. ఏ రంగంలో కూడా లేవనేది నిజం. నాడు సామాన్యుల నుంచి రాజకీయ నాయకులు, సినిమా వారిలో కూడా ఎంతో కొంత నైతికత, విలువలు, తామేం చేస్తున్నాం? సమాజంపై మనం చూపుతున్న ప్రభావం ఏమిటి? వంటి విషయాలలో స్పృహ ఉండేది. కానీ నేడు కాలంతో పాటు అన్ని రంగాలలో విలువలు పతనం అవుతున్నాయి. ప్రతి ఒక్కడు తన స్వార్ధం, తన సౌక్యం చూసుకునేవాడే.. బంధుప్రీతి, అవినీతిని ప్రోత్సహించిన వాడే. ఇక సినిమా వారి విషయానికి వస్తే ఇటీవల వస్తున్న ‘చీకటి గదిలో చితకొట్టుడు, 90ఎంఎల్‌’ వంటి పలు చిత్రాలు మనం ఏ దారిలో నడుస్తున్నామో తెలుపుతున్నాయి. నాటి శివ నుంచి నిన్నటి అర్జున్‌రెడ్డి, ఆర్‌ఎక్స్‌100, కేజీఎఫ్‌ వంటి వాటి స్ఫూర్తితో జరుగుతున్న అఘాయిత్యాలు అన్ని ఇన్ని కావు. 

కానీ మన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు మాత్రం సినిమా అనేది వ్యాపారం, మేం కేవలం నటిస్తున్నాం.. పారితోషికం తీసుకుని దానికి న్యాయం చేస్తున్నాం.. అని వాదించేవారే. అందుకే కైకాల సత్యనారాయణ వంటి వారు బాహుబలి వంటి గ్రాఫిక్స్‌ని విఠలాచార్య ఎప్పుడో తీశాడు. కాకపోతే నాడు వాటిని కెమెరా ట్రిక్స్‌ అనేవారు. ఇప్పుడు గ్రాఫిక్స్‌, విఎఫ్‌ఎక్స్‌లు అంటున్నారు. అన్ని కోట్లు పెట్టి తీసిన బాహుబలి కంటే చిన్న చిత్రమైనా బిచ్చగాడులో చూపిన విలువలు గొప్పవని తెలిపాడు. 

ఇక విషయానికి వస్తే తెలుగు బుల్లితెరపై ప్రస్తుతం అత్యంత ప్రజాధరణ ఉన్న షో ఏమిటి అంటే జబర్ధస్త్‌ అనే చెబుతారు. ఆ షోలో వస్తున్న స్కిట్స్‌, ఇతరులను అవమానిస్తున్న విధానం, కామెడీ పేరుతో స్త్రీలను, వికలాంగులను కూడా హేళన చేస్తున్న విధానంపై తీవ్ర విమర్శలు కూడా ఉన్నాయి. కానీ వాటిని నాగబాబు, రోజా, అనసూయ, రేష్మి వంటి వారు తమదైన శైలిలో సమర్ధించుకున్నారు. ఇక ప్రస్తుతం నాగబాబు నరసాపురం ఎంపీగా, రోజా నగరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. వీరు ఓడిపోతే మరలా ఈ షోకి వస్తారేమో గానీ గెలిస్తే మాత్రం ఈ షోని వదిలేయడమే గ్యారంటీ. ఈ పరిస్థితుల్లో ఈ కార్యక్రమ నిర్వాహకులు సహజనటి జయసుధని జడ్జిగా ఉండమని కోరారట. 

కానీ అలాంటి అడల్డ్‌ షోకి తాను జడ్జిగా వ్యవహరించలేనని ఆమె ఖచ్చితంగా చెప్పడం నిజంగా అభినందనీయం. నటిగా, హీరోయిన్‌గా, ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కూడా జయసుధ ఎప్పుడు శృతిమించి చేసిన దాఖలాలు లేవు. కాబట్టి నిజంగానే ఆమె మంచి నిర్ణయం తీసుకొందని, లేకపోతే సహజనటిగా ఆమెకున్న ఇమేజ్‌కి మచ్చ వచ్చి ఉండేది మాత్రం గ్యారంటీ అనే చెప్పాలి. 



By April 15, 2019 at 07:49AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45543/jayasudha.html

No comments