Breaking News

ఇలియానాకు మళ్లీ ఛాన్సిస్తున్నారు..!


సినిమా పరిశ్రమలో కొందరికి కొందరిపై ఎంతో నమ్మకం ఉంటుంది. పరాజయాలు ఎదురైనా, సెంటిమెంట్స్‌ కాదన్నా కూడా వారి నిర్ణయాలు మాత్రం మారవు. ముందుగా తప్పని పరిస్థితుల్లో ఎవరినో అనుకున్నా కూడా చివరకి వచ్చే సరికి వారి మనసు ఆయా వ్యక్తుల వైపుకే లాగుతూ ఉంటుంది. ఇక విషయానికి వస్తే తెలుగులో ఒకనాడు గోవాసుందరిగా, గోవా కోవాగా, బొడ్డు సుందరిగా మొట్టమొదట తెలుగులో కోటి రూపాయల పారితోషికం తీసుకున్న నటిగా ఇలియానాకి పేరుంది. ఆమె తెలుగులో దాదాపు యంగ్‌స్టార్స్‌ అందరితో చెట్టాపట్టాలేసుకుంది. ఆ తర్వాత బిటౌన్‌ కోసం ముంబై ఫ్లయిట్ ఎక్కింది. అక్కడ ఆశించిన విజయాలురాకున్నా కూడా మరలా దక్షిణాదికి వచ్చే చాన్సే లేదని భీష్మించుకుంది. చివరకు తప్పనిసరి పరిస్థితుల్లో మరలా తను మెచ్చిన, నచ్చిన హీరో రవితేజ - శ్రీనువైట్ల కాంబినేషన్‌లో రూపొందిన ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’తో రీఎంట్రీ ఇచ్చింది. 

దీనితో మరలా ఇలియానాకి తెలుగులో సుడి తిరగడం ఖాయమని పలువురు భావించారు. కానీ ఈ చిత్రం డిజాస్టర్‌ అవ్వడంతో అమ్మడికి మరో చాన్స్‌ రాలేదు. ఇక విషయానికి వస్తే మరోవైపు వరుస పరాజయాలలో ఉన్న శ్రీనువైట్లకి ఎడారిలో ఒయాసిస్‌లా మరో ఫ్లాప్‌ హీరో మంచు విష్ణు చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం లభించింది. ఇది శ్రీనువైట్ల-మంచు విష్ణుల కాంబినేషన్‌లో వచ్చిన హిలేరియస్‌ కామెడీ ట్రెండ్‌ సెట్టర్‌ ‘ఢీ’కి సీక్వెల్‌. ‘ఢీ’ చిత్రంలో మంచు విష్ణుకి జోడీగా జెనిలీయా నటించింది. మంచు విష్ణు కెరీర్‌లో ఉన్న అతి పెద్ద ఏకైక హిట్‌ ‘ఢీ’ మాత్రమే. 

ఇక దీని సీక్వెల్‌కి మొదట యూనిట్‌ రకుల్‌ప్రీత్‌సింగ్‌ని ఖరారు చేసుకుందని వార్తలు వచ్చాయి. కానీ శ్రీనువైట్ల మాత్రం తనతోపాటు ఇలియానాకి కూడా ఈ చిత్రంతో మంచి బ్రేక్‌ ఇవ్వాలని ఆశపడుతున్నాడట. దాంతో ఇలియానాని ఒప్పించేందుకు ఆయన నిర్మాత, హీరో మంచు విష్ణుల పర్మిషన్‌ కోసం ఎదురు చూస్తున్నాడని తెలుస్తోంది. గతంలో మంచు విష్ణుతో ఇలియానా ‘సలీం’ చిత్రంలో నటించింది. ఈ చిత్రానికి ఇలియానాని తెరకు పరిచయం చేసిన వైవిఎస్‌ చౌదరి దర్శకుడు కావడం విశేషం. 



By April 18, 2019 at 07:40AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45581/ileana.html

No comments