Breaking News

‘సీత’ మౌనానికి కారణం ఏమిటి?


ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘ఎఫ్‌2’ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కానీ మిగిలిన చిత్రాలేవీ ఆశించిన ఫలితాలను సాధించలేదు. ఆ తర్వాత కళ్యాణ్‌రామ్‌ నటించిన ‘118’ బడ్జెట్‌పరంగా చూస్తే మంచి విజయాన్నే అందుకుంది. ఇక ఇటీవల వచ్చిన నాగచైతన్య-సమంతల ‘మజిలీ’ చిత్రం చైతు కెరీర్‌లోనే బెస్ట్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయి. వరుసగా అరడజను డిజాస్టర్లు పొందిన మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ నటించిన ‘చిత్రలహరి’ చిత్రం ఆయనకు కాస్త ఊరటనిచ్చింది. ‘సుప్రీమ్’ తరహాలో 25కోట్లకు రీచ్‌ అయ్యే అవకాశాలు లేకపోయినా బిజినెస్‌ జరిగిన విధానం చూసుకుంటే ఈ చిత్రం తేజుని కాస్త ఒడ్డున పడేసినట్లేనని చెప్పాలి. 

ఇక నాని ‘జెర్సీ’ చిత్రం 19న విడుదల కానుంది. ఈ చిత్రం ప్రమోషన్స్‌ కూడా ఆశించిన స్థాయిలో లేవనే టాక్‌ వినిపిస్తోంది. అయినా ఈ చిత్రంతో ‘కృష్ణార్జునయుద్దం, దేవదాస్‌’లను మైమరిపించే గట్టి హిట్‌ కొట్టడం ఖాయమనే బలమైన నమ్మకంతో నాని అండ్‌ టీం ఉంది. మరోవైపు తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌, కాజల్‌ జంటగా ‘సీత’ ఏప్రిల్‌ 25న థియేటర్లలోకి రావాలని ప్రయత్నిస్తోంది. శ్రీరామనవమి సందర్భంగా విడుదలచేసిన పోస్టర్స్‌లో కూడా ఆ తేదీని బాగా హైలైట్‌ చేశారు. విడుదలకు మరో పది రోజులు కూడా లేదు. నేటి రోజుల్లో ఇలాంటి చిత్రాలకు ప్రమోషన్‌ అనేది ఎంతో కీలకం. కనీసం సినిమా విడుదలైన సంగతి ప్రేక్షకులకు తెలియాలన్నా, థియేటర్ల వరకు ప్రేక్షకులను రప్పించాలన్నా ప్రమోషన్స్‌ చాలా ముఖ్యం. కానీ ఈ విషయంలో ‘సీత’ సందడి కనిపించడం లేదు. కానీ ఈ చిత్రాన్ని ఎలాగైనా అదే డేట్‌కి ప్రేక్షకుల ముందుకు తేవాలని తేజ గట్టి పట్టుదలతో ఉన్నాడు. 

ఇప్పటివరకు ఓ ఐటం సాంగ్‌ ఆడియోతో పాటు దాని వీడియో శాంపిల్‌ తప్పితే ట్రైలర్‌, ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ వంటివేమీ ఖరారు కాలేదు. ఒకవైపు ఈ చిత్రంలో ప్యాచ్‌వర్క్‌ ఇంకా మిగిలే ఉందని, అదే సమయంలో పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు కూడా ఇంకా జరుగుతూనే ఉన్నాయని తెలుస్తోంది. నేటి రోజుల్లో సినిమా తీయడం కన్నా దానిని ప్రేక్షకుల వద్దకు తీసుకుని పోవడం చాలా ముఖ్యం. అందునా బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ వంటి అప్‌కమింగ్‌ హీరోకి ఇది ఇంకా ఇంపార్టెంట్‌. తోడుగా తేజతో పాటు కాజల్‌ కూడా ఉంది. మరి ఈ విషయంపై ఇకనైనా యూనిట్‌ దృష్టి కేంద్రీకరిస్తుందో లేదో చూడాలి. 



By April 18, 2019 at 07:30AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45580/sita.html

No comments