Breaking News

నితిన్ లైన్‌లోకి వచ్చేసినట్లే..!


నితిన్‌ కెరీర్‌ అ..ఆ తర్వాత ఊపందుకుంటుందని అందరు భావించారు. కానీ ఈ చిత్రంలో నితిన్‌ కంటే సమంతనే హైలెట్ అయింది. 50కోట్ల క్లబ్‌లో చేరినా కూడా ఆ క్రెడిట్‌ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, హీరోయిన్‌ సమంతల ఖాతాలోకే వెళ్లింది. ఆ తర్వాత ఆయన పవన్‌, త్రివిక్రమ్‌తో పాటుతన తండ్రి సుధాకర్‌రెడ్డి భాగస్వామ్యంలో చేసిన ఛల్‌ మోహన్ రంగ, లై, శ్రీనివాస కళ్యాణం వంటి పలు చిత్రాలు తీవ్రనిరాశనే మిగిల్చినాయి. దాంతో కొంత కాలం గ్యాప్‌ ఇచ్చిన నితిన్‌ మరలా జోరు పెంచుతున్నాడు. ఇప్పటికే ఈయన ఛలో దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ చిత్రం చేయనున్నాడు. మరి కారణాలు ఏమిటో గానీ ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌కి వెళ్లడానికి ఇబ్బందులు పడుతోంది. 

మరో చిత్రాన్ని ఆయన తెలుగులో క్రియేటివ్‌ దర్శకునిగా పేరున్న చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో చేయడం ఖాయమైంది. ఈ మూవీకి భవ్య ఆనంద్‌ప్రసాద్‌ నిర్మాత. ఐతే, అనుకోకుండా ఒకరోజు, ఒక్కనున్నాడు, ప్రయాణం, సాహసం, మనమంతా వంటి అద్భుతమైన చిత్రాలను గతంలో యేలేటి తెరకెక్కించాడు. మనమంతా చిత్రం తర్వాత ఆయన దాదాపు మూడేళ్లు విరామం తీసుకున్నాడు. యేలేటి-నితిన్‌ల చిత్రానికి గతంలో యేలేటి తీసిన అనుకోకుండా ఒకరోజు, ఒక్కడున్నాడు చిత్రాలకు సంగీతం అందించిన కీరవాణినే మ్యూజిక్‌ అందించనున్నాడట. 

ఏప్రిల్‌ మధ్యలో షూటింగ్‌ ప్రారంభం అవుతుందని స్వయంగా నితిన్‌ ప్రకటించాడు. ఈ రెండు చిత్రాలతో పాటు నితిన్‌ మరో రెండు చిత్రాలను కూడా లైన్‌లో ఉంచాడని తెలుస్తోంది. తెలుగులో వరుస ఫ్లాప్‌ చిత్రాలను తీసిన రమేష్‌ వర్మతో నితిన్‌ మరో చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రానికి కోనేరు సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. మరోవైపు కుమారి 21 ఎఫ్‌ దర్శకుడు సూర్యప్రతాప్‌ దర్శకత్వంలో గీతాఆర్ట్స్‌2లో బన్నీవాస్‌తో కూడా నితిన్‌ చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. నిజానికి వరుస ఫ్లాప్‌లలో ఉన్న నితిన్‌ని మరలా గాడిన పడేసిన చిత్రాలుగా విక్రమ్‌ కెకుమార్‌ ఇష్క్‌, విజయ్‌ కుమార్‌ కొండా గుండెజారి గల్లంతయ్యిందేలను చెప్పాలి. 

ఇక విజయ్‌కుమార్‌ కొండ గుండెజారి గల్లంతయ్యిందే తర్వాత ఒక లైలా కోసం చిత్రం తీశాడు. ఇది ఫ్లాప్‌ అయింది. ఆ తర్వాత ఆయన పలు వ్యక్తిగత వివాదాలు, సమస్యలు ఎదుర్కొన్నాడు. ఎంతో గ్యాప్‌ తీసుకున్న కొండా ఇటీవలే నితిన్‌కి ఓ స్టోరీ లైన్‌ చెప్పి ఓకే చేయించుకున్నాడట. మరి ఇది గుండె జారి గల్లంతయ్యిందేకి సీక్వెల్‌గా రానుందా? లేక అలాంటి కన్‌ఫ్యూజ్‌డ్‌ కామెడీ ఆధారంగా ఫ్రెష్‌ సబ్జెక్ట్‌తో ఇది రూపొందనుందా? అన్న చర్చ సాగుతోంది. మొత్తానికి కొంత గ్యాప్‌ తీసుకున్నా కూడా వరుస చిత్రాలను లైన్‌లో పెట్టి నితిన్‌ తన జోరు చూపిస్తున్నాడనే చెప్పాలి. 



By March 23, 2019 at 12:44PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45258/nithin.html

No comments