Breaking News

‘డియర్‌ కామ్రేడ్‌’ రచ్చ రచ్చ చేస్తున్నాడు!


నేటితరంలో రాంగోపాల్‌వర్మ, పోసాని కృష్ణమురళిలతో పాటు మోస్ట్‌ వాటెండ్‌ యంగ్‌ సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండది కూడా ప్రత్యేకమైన యాటిట్యూడ్‌. తాను నటించే చిత్రాల టైటిల్స్‌ నుంచి పోస్టర్స్‌, టీజర్లు, ట్రైలర్స్‌ దాకా... ఇక తాను మాట్లాడే ప్రతి విషయం సెన్సేషన్‌ అయ్యేలా ఆయన చూసుకుంటాడు. అందుకే అభిమానులు ఆయనను టాలీవుడ్‌ మెగాస్టార్‌ అనే కాదు.. సెన్సేషనల్‌ స్టార్‌, రౌడీస్టార్‌ అని కూడా పిలుస్తుంటారు. ‘అర్జున్‌రెడ్డి’ వేడుకలో వచ్చిన ప్రేక్షకుల చేత బూతు పదాన్నిపలికించేలా చేయడం, లిప్‌లాక్‌ సీన్స్‌, వాటిని వ్యతిరేకించిన విహెచ్‌ హనుమంతరావుని ‘చిల్‌ తాతయ్యా’ అని, ‘నోటా’తో టైటిల్‌ని కూడా వివాదం చేసి తన చిత్ర ప్రమోషన్స్‌కి వాడుకోవడం విజయ్‌కే చెల్లింది. మిగిలిన వారి విషయం ఏమో గానీ విజయ్‌లోని ఈ యాటిట్యూడ్‌ ఆయనకు బాగానే కలిసొస్తోంది. ‘అర్జున్‌రెడ్డి, గీతగోవిందం, ట్యాక్సీవాలా’ ఇలా వరుస విజయాలు సాధిస్తూ వస్తున్నాడు. 

ఇక లిప్‌లాక్‌ల విషయంలో ఈయన తనకే పేటెంట్‌ హక్కులు ఉన్నాయనేలా తెరపై రెచ్చిపోతూ ఉంటాడు. అర్జున్‌రెడ్డి తర్వాత తాజాగా విడుదలైన ‘డియర్‌ కామ్రేడ్‌’లో కూడా ఆయన టీజర్‌లోనే రెచ్చిపోయాడు. హీరోయిన్‌ రష్మిక మందన్నతో లిప్‌లాక్‌తో సంచలనాలకు కేంద్రబిందువుగా మారాడు. మరి టీజర్‌లోనే ఇలా ఉంటే ఇక సినిమా మొత్తం ఎలా ఉంటుందో? అని అనుకునేలా చేశాడు. ఈ చిత్రం విడుదలకు చాలా సమయం ఉన్న కూడా భరత్‌కమ్మ దర్శకత్వంలో మైత్రిమూవీమేకర్స్‌ సంస్థ నింపాదిగా బిజినెస్‌ని క్లోజ్‌ చేసుకుంటూ వస్తోంది. 

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల కానుండటం వల్ల ఈ చిత్రం ఈజీగా రిలీజ్‌కి ముందే 50కోట్లను తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు వరుస షూటింగ్స్‌ బిజీ వల్ల విజయ్‌కి కాస్త జ్వరం రావడంతో ఆసుపత్రిలో చేరాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హోలీని చాలా బాగా జరుపుకున్నాను. ఉదయం వరకు షూటింగ్‌లోనే ఉన్నాను. దీంతో నాకు జ్వరం వచ్చింది. త్వరగా కోలుకుని షూటింగ్స్‌కి హాజరవుతాను అని చెప్పుకొచ్చాడు. 

ఇక కామ్రేడ్‌ అనే పదం ఎంతో గొప్పది. వామపక్ష వాదులు, సోషలిస్ట్‌లు, చివరకు నక్సలైట్స్‌ కూడా సమాజంలో మార్పుకోసం నిరంతరం కృషి చేసేవారిని కామ్రేడ్‌ అని పిలుచుకుంటారు. నాటి పుచ్చలపల్లి సుందరయ్య వంటి వారిని కామ్రేడ్‌ పి.ఎస్‌ అని పిలిచేవారు. కానీ ఇలాంటి మహోన్నతమైన టైటిల్‌ని పెట్టుకున్నప్పుడు చిత్రం కూడా అంతే హుందాగా ఉండాలి. కానీ ‘డియర్‌ కామ్రేడ్‌’ అంటూనే మూతి ముద్దులను చూపించడం మంచి పని కాదనే చెప్పాలి. కాగా ఈ చిత్రం మే31న విడుదల కానుంది. 



By March 24, 2019 at 09:57AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45267/vijay-deverakonda.html

No comments