Breaking News

రజనీ రాజకీయ నాయకుడు కాదంట!


రజనీకాంత్‌.. ఈయన పేరు చెబితే తమిళంలోనే కాదు.. దేశంలోని అన్ని భాషల్లో, మలేషియా, జపాన్‌ వంటి దేశాలలోని ప్రేక్షకులు ఉర్రూతలూగిపోతారు. కాగా ప్రస్తుతం రజనీకాంత్‌ మురుగదాస్‌తో ఓ చిత్రం చేయనున్నాడు. ఇది రజనీకి ‘పేట’, మురుగదాస్‌ ‘సర్కార్‌’ల తర్వాత రూపొందుతున్న చిత్రం. ప్రస్తుతం ప్రీపొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్న ఈ మూవీని రజనీ అభిమానులు తలైవర్‌ 166గా పిలుచుకుంటున్నారు. ఈ చిత్రంలో రజనీ డ్యూయల్‌ రోల్‌ని పోషిస్తాడని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఓ పాత్ర ముంబై నేపధ్యంలో సాగే పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా ఉంటుందని, రెండో పాత్ర రాజకీయ నాయకుడిగా మలిచారని సమాచారం. ఇక ఇందులో రజనీ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రను పోషిస్తున్న వార్త నిజమేనని తెలుస్తోంది. కానీ రెండో పాత్రపై ఇంకా సస్పెన్స్‌ వీడలేదు. రెండో పాత్ర రాజకీయ నాయకుడిగా ఉంటుందని కొందరు అంటూ ఉంటే.. ఏకంగా తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆయన ఈ పాత్రలో కనిపించనున్నాడని పుకార్లు మొదలయ్యాయి. 

కానీ తాజా సమాచారం ప్రకారం ఇందులో రజనీ పోషించే రెండో పాత్ర సమాజ సేవకునిగా ఉంటుందని సమాచారం. సోషల్‌ యాక్టివిస్ట్‌ అయిన ఆయన ఏ అంశంపై పోరాడుతాడు? అనేది సస్పెన్స్‌ అంటున్నారు. ఇక గతంలో మురుగదాస్‌ విజయ్‌తో తీసిన ‘కత్తి’ చిత్రంలో విజయ్‌ దొంగగా, సమాజ సేవకునిగా కనిపించాడు. ఈసారి మురుగదాస్‌ రజనీని ‘పోలీసు-సమాజ సేవకుడు’గా చూపించనుండటం విశేషం. ఇందులో రజనీ సరసన నయనతార, కీర్తిసురేష్‌లు నటించనున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. 

ఈ మూవీకి అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తుండగా, సంతోష్‌ శివన్‌ సినిమాటోగ్రఫీ అదిరిపోయే విధంగా ఉంటుందిట. రజనీ-మురుగదాస్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న తొలి చిత్రం కావడంతో దీనిపై అన్ని భాషల్లోనూ విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇది రజనీ కెరీర్‌లోనే అత్యంత పెద్ద హిట్‌గా నిలవబోతోందని రజనీ, మురుగదాస్‌ అభిమానులతో పాటు కోలీవుడ్‌ సినీ విశ్లేషకులు నమ్మకంగా ఉన్నారు.



By March 24, 2019 at 09:47AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45266/rajinikanth.html

No comments