Breaking News

‘మహర్షి’తో మహేష్ ఆ ఫిగర్ బీట్ చేస్తాడా?


తెలుగులో ‘బాహుబలి’ రికార్డులను బద్దలు కొట్టడం మరలా జక్కన్న దర్శకత్వంలో వచ్చే ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’కే ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు. అయితే ఆలోపు వచ్చే చిత్రాలలో ఏదైనా నాన్‌-బాహుబలి రికార్డులను సొంతం చేసుకునే చాన్స్‌ందా? లేదా? అనేది ఆసక్తిని రేపుతోన్న ప్రశ్న. నిజానికి మొదట నాన్‌బాహుబలి రికార్డులను మెగాస్టార్‌ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం, ఆయన దాదాపు దశాబ్దం గ్యాప్‌ తర్వాత వినాయక్‌ దర్శకత్వంలో చేసిన ‘ఖైదీనెంబర్‌ 150’ సాధించింది. కానీ ఆ రికార్డును ఆయన కుమారుడు, మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ సుకుమార్‌తో కలిసి ‘రంగస్థలం’తో బద్దలు కొట్టారు.

ఈ చిత్రం ఇంటా బయటా ఏకంగా 120కోట్లకు పైగా షేర్‌ వసూలు చేసింది. దానికి అటు ఇటుగా వచ్చిన మహేష్‌బాబు భరత్‌ అనే నేను 95కోట్ల వద్ద ఆగిపోయింది. ఇక మే 9న మహేష్‌ ప్రతిష్టాత్మక 25వ చిత్రం ‘మహర్షి’ విడుదల కానుంది. ఈ చిత్రం అయినా రంగస్థలం రికార్డులను బద్దలు కొడుతుందో లేదో వేచిచూడాలి. ఆ తర్వాత ‘సై..రా’, ‘సాహో’ వంటి చిత్రాలు ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో?



By March 25, 2019 at 03:01PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45288/mahesh-babu.html

No comments