అనిల్ రావిపూడి.. ‘వినరా సోదర వీరకుమారా’
లక్ష్మణ్ సినీ విజన్స్ పతాకంపై శ్రీనివాస సాయి, ప్రియాంక జైన్ హీరోహీరోయిన్లుగా సతీష్ చంద్ర నాదెళ్ల దర్శకత్వంలో, లక్ష్మణ్ క్యాదారి నిర్మించిన చిత్రం ‘వినరా సోదర వీరకుమారా’. ఈ చిత్రం ఫస్ట్ సాంగ్ ని ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఇటీవల హైదరాబాద్‌లో లాంచ్ చేసారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు ప్రముఖ నిర్మాత బెక్కం వేణు గోపాల్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ... ‘‘వినరా సోదర వీరకుమారా ట్రైలర్ చూసాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సాంగ్స్ కూడా చాల బాగున్నాయి. ఈ సినిమా హిట్ అవుతుందని ఆశిస్తూ, టీమ్ మొత్తానికి నా విషెస్ తెలియజేస్తున్నాను.’’ అన్నారు.
ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ... ‘‘ఈ ప్రొడ్యూసర్ లక్ష్మణ్ నేను కలసి మేం వయసుకి వచ్చాము మూవీ చేసాం. ఈ చిత్ర టీం కొత్త ప్రయత్నం చేశారు. మూవీ చాలా బాగుంది. దర్శకుడు అనిల్‌తో సాంగ్ లాంచ్ చేయడం శుభ పరిణామం’’ అని అన్నారు.
చిత్ర నిర్మాత లక్ష్మణ్ మాట్లాడుతూ... ‘‘మా సినిమా మొదటి పాటను అనిల్ రావిపూడి గారు రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో హీరో శ్రీనివాస సాయి, చిత్ర దర్శకుడు సతీష్ చంద్ర నాదెళ్ల, అనిల్ మైలాపురం, కిరణ్ .సి.హెచ్. తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస సాయి, ప్రియాంకజైన్, జాన్సీ, ఉత్తేజ్, జెమిని సురేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా : రవి.వి , సంగీతం : శ్రవణ్ భరద్వాజ్, మాటలు: లక్ష్మీ భూపాల, ఎడిటర్ : మార్తాండ్ .కె.. వెంకటేష్, నిర్మాత : లక్ష్మణ్ క్యాదారీ, దర్శకత్వం : సతీష్ చంద్ర నాదెళ్ల.
By February 22, 2019 at 06:31AM
No comments