ఒట్టు.. ఈ సినిమా పేరు ‘బొట్టు’
మార్చి 8న తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు సిద్ధమైన ‘బొట్టు’
‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్, నమిత, ఇనియా, ఊర్వశి, షకీలా ప్రధాన తారాగణంగా వి.సి.వడివుడయాన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన చిత్రం ‘బొట్టు’. మార్చి 8న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఎస్.ఎస్ సమర్పణలో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై జి.కుమార్ బాబు ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
ఈ సందర్భంగా జి.కుమార్ బాబు మాట్లాడుతూ.. ‘‘తెలుగు, తమిళ భాషల్లో ఘన విజయం సాధించిన కాంచన, గంగ చిత్రాల తరహాలోనే అదరగొట్టే గ్రాఫిక్స్‌తో వస్తోన్న మరో హారర్ కామెడీ యాక్షన్ చిత్రమిది. బొట్టు అనే పేరు గల ఓ గిరిజన యువతి కథ ఇది. కథాకథనాలు చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉంటాయి. 52 నిమిషాల గ్రాఫిక్స్ మాయాజాలం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సెన్సార్ ఇబ్బందుల కారణంగా చాలా రోజులుగా సినిమా విడుదల నిలిచిపోయింది. చివరకు, రివైజింగ్ కమిటీ ద్వారా సర్టిఫికెట్ పొందాం. మన తెలుగు ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని కలిగిస్తుందనే ఉద్దేశంతోనే ఈ చిత్రం విడుదల హక్కులను మేం తీసుకున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీతో సహా విడుదలకు సిద్ధంగా ఉన్నాం’’ అని తెలిపారు.
తంబిరామయ్య, సాయాజీ షిండే, మొట్ట రాజేందర్, మన్సూర్ అలీఖాన్, నిరోషా తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: అమ్రీష్, కెమెరా: ఎనియాన్ జె. హ్యారీస్, మాటలు: ఎం.రాజశేఖర్‌రెడ్డి, ఫైట్స్: సూపర్ సుబ్బరాయన్, ఎడిటర్: ఎలీనా, పాటలు: శివగణేష్.
By February 23, 2019 at 06:44AM
No comments