Breaking News

ఐ‌లవ్‌‌యూ చెప్పాల్సివస్తే ప్రభాస్‌కే చెప్తుందట!


సాధారణంగా మన హీరోయిన్లను ఏ హీరో ఇష్టం అంటే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి గొప్పగా చెబుతూ, అందరు ఇష్టమేనన్నట్లు బిల్డప్‌ ఇస్తారు. ఎవరికి ఐలవ్‌యు చెబుతారు? ఎవరితో నటించాలని ఉంది? అనే ప్రశ్నలకు కూడా తెలివిగా సమాధానం ఇస్తూ ఉంటారు. కానీ ఈ విషయంలో తాను చాలా రెబల్‌ అని శరత్‌కుమార్‌ కూతురు వరలక్ష్మీ శరత్‌కుమార్‌ నిరూపించింది. ఇటీవల ఆమె కేవలం హీరోయిన్ల వేషాలే కాదు.. విలనిజం ఉన్న పాత్రలతో కూడా మెప్పిస్తోంది. ‘పందెంకోడి2, సర్కార్‌’ చిత్రాలలో తన నటనతో మెప్పించింది. 

ఇక ఈమెకి గతంలో విశాల్‌తో ఎఫైర్‌ ఉందని వార్తలు వచ్చాయి. ఈ విషయంలో వారు ఎంతో కాలం మౌనంగా ఉన్నారు. తాజాగా మాత్రం తమ ఇద్దరి మధ్య అదేమీ లేదని, తాము కేవలం స్నేహితులమేనని చెప్పుకొచ్చారు. ఈభామ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘ఐ లవ్‌ యు’ అని చెప్పాలని భావిస్తే ఎవరికి చెబుతారు? అనే ప్రశ్న ఎదురైంది. వెంటనే ఆమె తడుము కోకుండా నేను ఐ లవ్‌ యూ చెప్పాల్సి వస్తే యంగ్‌ రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌కే చెబుతాను. ఎందుకంటే ఆయనంటే నాకు చాలా ఇష్టం. నేను లవ్‌ ప్రపోజ్‌ చేయాలనుకుంటే ప్రభాస్‌కి తప్ప ఇంకెవ్వరికీ చేయను అని బోల్డ్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. 

ఇప్పటికే ప్రభాస్‌కి ఎవరెవరితోనే సంబంధాలు అంటగడుతున్నారు. ఓవైపు అనుష్కతో లవ్‌లో ఉన్నాడని, అందుకే ఇప్పటివరకు అనుష్క, ప్రభాస్‌లు ఇద్దరు పెళ్లి చేసుకోలేదనే పుకార్లు వినిపిస్తున్నాయి. వీటిపై అనుష్క మండిపడి చట్టప్రకారం చర్యలు తీసుకుంటానని చెప్పినా, ప్రభాస్‌ ఏకంగా ‘కాఫీ విత్‌ కరణ్‌’లో కూడా ‘బాహుబలి’లో తనకు జోడీగానే కాదు.. తల్లిగా కూడా నటించిన అనుష్కని ఎలా వివాహం చేసుకుంటాను? అని క్లారిటీ ఇచ్చినా ఇవి ఆగడం లేదు. మరోవైపు షర్మిల ఉదంతం. మొత్తానికి వీటన్నింటికి సమాధానం చెప్పాలంటే ప్రభాస్‌ పెళ్లి చేసుకుంటేనే తప్ప వీటికి ఫుల్‌స్టాప్‌ పడవు. 



By February 22, 2019 at 02:54PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44831/varalakshmi-sarathkumar.html

No comments