Breaking News

పాక్ పై భలే పంచులు పేల్చాడు


నిజానికి వర్మలో ఒకప్పుడు మంచి దర్శకుడు ఉండేవాడు. ఇప్పటికీ ఆయనలో గ్రేట్‌ టెక్నీషియన్‌, ప్రమోషన్స్‌ని చేసి సినిమాలో కంటెంట్‌ లేకపోయినా రెండు మూడు రోజులు జనాలు చూసేలా చేసి పెట్టిన పెట్టుబడిని రాబట్టే గ్రేట్‌ బిజినెస్‌మైండ్‌ ఆయనది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక వర్మ ఎక్కువగా మాఫియా, హర్రర్‌, ఇతర వివాదాస్పద అంశాలపైనే దృష్టి పెడుతూ ఉంటాడు. కానీ నిజంగా రాంగోపాల్‌వర్మ తీవ్రవాదం నేపధ్యంలో సినిమాలు తీస్తే అవి ఖచ్చితంగా బాగా ఆడుతాయి. ఇండియా-పాకిస్థాన్‌-చైనా, బిన్‌లాడెన్‌, ఆల్‌ఖైదా, లష్కర్‌ తోయిబా వంటి వాటిని ఇతివృత్తంగా తీసుకుంటే ఎన్నో కథలు పుట్టుకొస్తాయి. దేశ ప్రజలకు సైనికుల కష్టాలు, ప్రభుత్వాల మోసాలు, సమస్యలకు మూలకారణాలు, దేశభక్తిని పెంపొందించేలా ఇవి చేయగలవు. 

వర్మ గతంలో ముంబైలోని తాజ్‌హోటల్‌పై జరిగిన ఉగ్రవాద దాడి నేపధ్యంలో తీసిన ‘ది ఎటాక్స్‌ ఆఫ్‌ 26/11’ బాగానే పేరు తెచ్చింది. వర్మకి బాలీవుడ్‌లో కూడా పేరుంది కాబట్టి పుల్వామా వంటి సంఘటనలకు ఆయన తెరరూపం ఇస్తే బాగుంటుందనే మాట వినిపిస్తోంది. తాజాగా వర్మలోని దేశభక్తుడు మరలా నిద్ర లేచాడు. పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ని ఏకిపారేశాడు. ప్రియమైన ప్రధాని అంటూనే ఇమ్రాన్‌పై సర్జికల్‌ స్ట్రైక్ చేశాడు. 

ఆయన ట్వీట్‌ చేస్తూ, సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారమవుతాయంటే అసలు మీకు మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు. ఒక వ్యక్తి వందల కొద్ది పేలుడు పదార్ధాలతో భారత్‌ వైపు పరుగెత్తుకొస్తున్నప్పుడు అతడితో చర్చలు ఎలా జరపాలో కాస్త మా భారతీయ మొద్దు బుర్రలకు నేర్పాలి. కావాలంటే ట్యూషన్‌ ఫీజ్‌ కూడా ఇచ్చుకుంటాం. ఒసామా బిన్‌లాడెన్‌ వంటి వ్యక్తి పాకిస్థాన్‌లో ఉన్న సంగతి మీకు తెలియకున్నా అమెరికాకి తెలుస్తుంది. మీది అసలు దేశమేనా? ఓ మొద్దు భారతీయుడు అడుగుతున్న ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి. మాకు కాస్త తెలివితేటలు నేర్పాలి. 

జైషేమహ్మద్‌, లష్కరే తోయిబా, తాలిబన్‌, ఆల్‌ఖైదా, మీ ప్లే స్టేషన్లు. ఆ సంస్థలపై నాకు అభిమానం లేదన్న విషయాన్ని మీరెప్పుడు చెప్పలేదు. ఇలాంటి ఉగ్రవాద సంస్థలను బంతులుగా పాకిస్థాన్‌ ఇండియా బౌండరీలు దాటిస్తోంది. వాటిని పెవిలియన్‌లలోకి పంపిస్తున్నారు. వాటిని మీరు బంతులనుకుంటున్నారా? లేక బాంబులనుకుంటున్నారా? అని వరుస ట్వీట్స్‌తో వర్మ ఇమ్రాన్‌ని ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు. 



By February 22, 2019 at 01:08PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44828/ram-gopal-varma.html

No comments