Breaking News

రేయ్ పృథ్వీ.. నాకు ఫోన్ చెయ్: నాగబాబు


మన రాజకీయాలు ఎప్పుడో భ్రష్టు పట్టిపోయాయి. అవినీతి, కులం, మత కంపులు కొడుతున్నాయి. ఇవ్వన్నీ ఎప్పటి నుంచో రాజకీయాలలో ఉన్నా కూడా బహిరంగ వ్యాఖ్యలు, విమర్శల విషయంలో నిన్నమొన్నటి దాకా కాస్త సహనం, సంయమనం కనిపించేవి. కానీ నేడు అవి కూడా దిగజారాయి.. రోడ్డుపై ఉరితీయండి.. గుడ్డలూడదీసి కొట్టండి.. కాల్చి చంపేయండి.. అంటూ కుటుంబసభ్యులు, తల్లిదండ్రులు, భార్యలు, సోదరీమణులను కూడా బజారు కీడుస్తున్నారు. మనది ప్రజాస్వామ్య దేశం కావడం వల్ల ఎవరైనా రాజకీయాల గురించి మాట్లాడవచ్చు. ఎవరు ఎక్కడినుంచైనా పోటీ చేయవచ్చు. నిజమే.. అలాగని నేలబారు, చవకబారు వ్యాఖ్యలు చేస్తూ రాజకీయాలను పందుల దొడ్డిగా, చేపల మార్కెట్‌గా మార్చితే ఎలా? ప్రస్తుతం కొందరు మిడిమిడి జ్ఞానం ఉన్న సినీ నటులు రాజకీయాలపై ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా, నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం తరపున ప్రచారం చేసిన కమెడియన్‌ వేణుమాధవ్‌ ‘బట్టేబాజ్‌’ అని, ఇంకా ఏవేవో మాట్లాడుతున్నారు. 

ఇక విషయానికి వస్తే ఇటీవల రాజకీయాలలోకి వచ్చిన కమెడియన్‌ పృథ్వీ హద్దు ఆపు లేకుండా మాట్లాడుతున్నాడు. ఆయన శివాజీ గురించి తాజాగా మాట్లాడుతూ, టిడిపితో అంటకాగి శివాజీ వైస్రాయ్‌ హోటల్‌లో ఎన్టీఆర్‌పై ఎవ్వరూ చెప్పులు వేయలేదని అన్నాడు. నాడు నేను సిటీ కేబుల్‌లో పనిచేస్తూ వైస్రాయ్‌ ఉదంతాన్ని కవర్‌ చేశాను. దానికి నేనే ప్రత్యక్షసాక్షిని. చంద్రబాబు చెప్పినట్లు శివాజీ ఆడుతున్నాడు. ఇక దివ్యవాణి నాడు బాపు బొమ్మ.. నేడు ఆమె చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ, చంద్రబాబు అండతోనే వారు వైసీపీ వారిని ధూషిస్తున్నారని చెప్పుకొచ్చాడు. 

ఇక పృథ్వీ పవన్‌, నాగబాబు, వరుణ్‌తేజ్‌లను ఉద్దేశించి కించపరిచే మాటలు మాట్లాడాడు. ఇటీవల వరుణ్‌తేజ్‌, నాగబాబులు కలిసి జనసేన పార్టీకి కోటి 25లక్షలు విరాళం ఇచ్చారు. దీనిపై పృథ్వీ స్పందిస్తూ, ఎక్కడి నుంచో తీసుకుని వచ్చిన డబ్బును తన కొడుకు ఖాతాలో వేసి దానిని జనసేనకు ఫండ్‌గా ఇచ్చారనే పృథ్వీ వ్యాఖ్యలపై నాగబాబు తీవ్రంగా మండిపడ్డాడు. ‘ఫండ్‌ గురించి పృథ్వీ కామెంట్‌ చేశాడా? రేయ్‌ పృథ్వీ. రేపు నువ్వు నాకు ఫోన్‌ చేయరా.. ఈ ప్రశ్నకు నేనే నీకు సమాధానం చెబుతాను. పృథ్వీ నీకే చెబుతున్నా.. రేపు ఉదయం నువ్వు నాకు ఫోన్‌ చేయ్‌ అని వార్నింగ్‌ ఇచ్చాడు’. 

అంతేకాదు. ఎవరికో ప్రూవ్‌ చేయాల్సిన అవసరం నాకు లేదు. నా ఖాతా నుంచి 25లక్షలు, వరుణ్‌ ఖాతా నుంచి కోటి ఇచ్చాం. ఎవరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు. అది బ్లాక్‌మనీ కాదు. మేము ఐటీకి ఆ డబ్బును చూపించాం. అకౌంటెడ్‌ క్యాష్‌ అది. అది పన్ను చెల్లించిన డబ్బు అని చెప్పుకొచ్చాడు.  By February 20, 2019 at 12:30PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44802/nagababu.html

No comments