Breaking News

లక్ష్మీస్ ఎన్టీఆర్: వర్మ ప్లాన్ చేస్తే అంతే!


ఎన్టీఆర్ బయోపిక్ దర్శకత్వ బాధ్యతలు బాలయ్య తనకి ఇవ్వలేదని.. కక్ష కట్టిన రామ్ గోపాల్ వర్మ... ఎన్టీఆర్ బయోపిక్ కి పోటీగా లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ లక్ష్మీపార్వతిని హైలెట్ చేస్తూ ఎన్టీఆర్ అవసాన, అలాగే వెన్నుపోటు రాజకీయాలను సినిమాగా తెరకెక్కించాడు. మొదట్లో వర్మకంత సీన్ లేదనుకున్నవాళ్లంతా... రీసెంట్ గా విడుదలయిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ చూసాక... వర్మ ప్లాన్ అర్ధమయ్యింది. ఇక వర్మ చాన్నాళ్ళకి మళ్ళీ ట్రాక్ ఎక్కుతున్నాడు. ఇక ఎన్టీఆర్ బయోపిక్ కి పోటీగా తన సినిమా మీద తనకి తానుగానే సోషల్ మీడియాని ఉపయోగించుకుని పబ్లిసిటీ చేస్తున్నాడు. అసలు వర్మ అలా లక్ష్మీస్ ఎన్టీఆర్ స్టేటస్ సోషల్ మీడియాలో పెడుతున్నాడో లేదో ఇలా అది కాస్త క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇక మహానాయకుడు విడుదలైన రోజున లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్‌ని థియేటర్స్ లో ప్రదర్శిస్తానంటూ.. ఛాలెంజ్ చేసిన వర్మ ఆ పనుల్లో బిజీగా ఉన్నాడు.

ఇక ఎన్టీఆర్ ని రాజకీయాలలో ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో... అలాగే ఎన్టీఆర్ ని కుటుంబం ఎలా దూరం చేసిందో.. లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ఎలా ఎంటరై చక్రం తిప్పిందో  అనేది తన సినిమాలో చూపించబోతున్న వర్మ... లక్ష్మీస్ ఎన్టీఆర్ ని మహానాయకుడుకి పోటీగా మాత్రం విడుదల చేయడంలేదు.. మహానాయకుడు రేపు శుక్రవారం విడుదలవుతుండగా ... లక్ష్మీస్ ఎన్టీఆర్ మాత్రం మార్చి రెండో వారంలో థియేటర్స్ లోకి తెస్తానని వర్మ చెబుతున్నాడు. మరి నిజంగా రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ని మహానాయకుడుకి పోటీగా వదిలేస్తే...  బాక్సాఫీసు రసవత్తరంగా మారేది.

ఇక మహానాయకుడు ఎలాంటి పబ్లిసిటీ లేకుండా థియేటర్స్ లోకి వస్తుంటే. లక్ష్మీస్ ఎన్టీఆర్ ని మాత్రం వర్మ ఎలాంటి పబ్లిసిటీ లేకుండా థియేటర్స్ లో తీసుకొచ్చేలాగే కనబడుతుంది. కేవలం తాను మాత్రమే సోషల్ మీడియా ద్వారా లక్ష్మీస్ ఎన్టీఆర్ పబ్లిసిటీని పీక్స్ కి తీసుకెళుతున్నాడు. ఇక నందమూరి, నారా వారి కుటుంబాలు స్పందిస్తే.. అది వర్మకి ఫ్రీ పబ్లిసిటీ అవుతుంది. అందుకే వారు గమ్మునున్నారు. ఇక వర్మ కూడా చాలా జాగ్రత్తగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ని ప్రేక్షకుల్లోకి తీసుకెళుతున్నాడు. మొన్నామధ్యన సాంగ్స్ తోనూ, నిన్న ట్రైలర్ తోనూ తర్వాత మరోవిధంగాను లక్ష్మీస్ ఎన్టీఆర్ ని ప్రేక్షకుల్లోకి దింపే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక వర్మ స్ట్రాటజీ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ విషయంలో బాగా వర్కౌట్ అయ్యి మంచి బిజినెస్ మొదలైందని టాక్ కూడా నడుస్తుంది. ఎలా లేదన్నా ఎన్టీఆర్ బయోపిక్ మహానాయకుడుకన్నా ఒకింత ఎక్కువ లక్ష్మీస్ ఎన్టీఆర్ మీద ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది.



By February 21, 2019 at 05:54AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44805/lakshmis-ntr.html

No comments