Breaking News

ప్రియా ప్రకాష్‌ అంటే చాలు మండిపడుతోంది


మలయాళంలో రోషన్ - నూరిన్ - ప్రియా ప్రకాష్‌లు జంటగా ‘ఒరు ఆదార్ లవ్’ తెరకెక్కింది. ఈ సినిమా తెరకెక్కించినప్పుడు దర్శకుడు ఎక్కువగా రోషన్ - నూరిన్‌నే హైలెట్ చేస్తూ ప్రియా ప్రకాష్ ని సైడ్ కేరెక్టర్ గానే ఉంచేసాడు. కానీ ప్రియా ప్రకాష్ కేవలం కన్ను గీటుతూ... రోషన్ కి వేళ్లతో గన్‌‌లా పేలుస్తూ సైగ చేసిందో.. ఒక్కసారిగా సోషల్ మీడియాలోనే కాదు ఇండియా వైడ్ గా సెలబ్రిటీ అవడంతో.. ‘ఒరు ఆదార్ లవ్’ దర్శకుడు ప్రియా కున్న క్రేజ్‌తో సినిమా కథను మళ్ళీ మార్చేసి.. సినిమాలో ప్రియా ప్రకాష్ ని మెయిన్ లీడ్ చేసేసాడు. అది ‘ఒరు ఆదార్ లవ్’ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అర్ధమయ్యింది. అయితే సినిమా విడుదలయ్యాక సినిమాలో సైడ్ రోల్ ప్రియా ప్రకాష్ దని.. అసలు కీలకపాత్ర నూరిన్ దే అని చాలామంది అన్నారు.

తాజాగా నూరిన్ కూడా అదే చెబుతుంది. ‘ఒరు ఆదార్ లవ్’ తెలుగులో లవర్స్ డే సినిమాగా విడుదలై అట్టర్ ప్లాప్ అయ్యింది. అయితే ఆ సినిమా గురించి ఆల్మోస్ట్ మరిచిపోతున్న తరుణంలో ఆ సినిమాలో నటించిన నూరిన్...అసలు ‘ఒరు ఆదార్ లవ్’ సినిమా మొదలైనప్పుడు తననే హీరోయిన్ గా తీసుకున్నారని.... కానీ ప్రియా ప్రకాష్ ఒక్కసారిగా పాపులర్ అవడంతో.. తన పాత్ర కుదించేసి.. ప్రియా ప్రకాష్ పాత్రని హైలెట్ చేసారని... కేవలం ప్రియా వలనే హీరోయిన్ గా ఉండాల్సిన తన పాత్ర చివరికి సపోర్టింగ్ రోల్ గా ఉండిపోయిదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది.

అయితే ఆ విషయంలో బాధపడుతున్న నూరిన్ ఈసారి ప్రియా ప్రకాష్ తో కలిసి నటించే అవకాశమొస్తే... వీలున్నంతవరకు ఒప్పుకోనని తెగేసి చెబుతుంది. పాపం ఎంత కడుపు మండిందో కదా. అలాగే హీరో రోషన్ తో అవకాశమొస్తే మాత్రం వదులుకోలేని కూడా చెబుతుంది నూరిన్. మరి నిజంగానే ‘ఒరు ఆదార్ లవ్’ దర్శకుడు ప్రియా కొచ్చిన క్రేజ్ తోనే సినిమా ఆడేస్తుందని.. చెత్త సినిమాని తీసి ప్రేక్షకుల మీదకి వదిలాడు. మరి ప్రేక్షకులేం తెలితక్కువ వల్లేం కాదుగా.. అందుకే తిప్పికొట్టారు.



By February 23, 2019 at 05:26AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44835/nurin-sharif.html

No comments