Breaking News

పాపం రకుల్.. అటు ఇటు కాకుండా పోతోంది


నిన్న సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ కి బ్యాడ్  టైం మాములుగా స్టార్ట్ కాలేదు.. అసలే తెలుగులో ఉన్న ఒక్క అవకాశం ఆమె చేజారిపోయిందనే న్యూస్ తెగ వైరల్ అయ్యింది. ప్రస్తుతం అవకాశాలు లేక గడ్డు పరిస్థితిని ఎదుర్కుంటున్న రకుల్ ప్రీత్‌కి తెలుగులో నాగ చైతన్య సరసన ఒకే ఒక్క అవకాశం ఉంది. వెంకటేష్ - నాగ చైతన్య కలిసి బాబీ దర్శకత్వంలో వెంకీమామ సినిమాలో చైతు సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా ఎప్పుడో ఫైనల్ అయ్యింది. అయితే తాజాగా చైతు సినిమా వెంకీమామ నుండి రకుల్‌ని తప్పించి వేరే హీరోయిన్‌కి ఛాన్స్ ఇచ్చారని.. పాపం రకుల్ ప్రీత్ అన్నారు అంతా. 

అయితే కొడుకు హ్యాండిస్తే.... తాజాగా రకుల్‌కి తండ్రి నాగార్జున ఛాన్స్ ఇచ్చాడనే వార్త ఫిలింసర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. నాగార్జున - రాహుల్ రవీంద్రన్ కాంబోలో తెరకెక్కుతున్న మన్మధుడు 2 సినిమాలో నాగార్జున సరసన రకుల్ ప్రీత్‌కి ఛాన్స్ వచ్చిందనే న్యూస్ వినబడుతుంది. అయితే రకుల్ ప్రీత్‌కి మన్మధుడు సినిమాలో నాగార్జున సరసన ఛాన్స్ రావడం వలనే.. ఆమె నాగ చైతన్య వెంకీమామ సినిమాలో తప్పుకుందని ప్రచారమూ షురూ అయ్యింది. మరి మరోపక్క కొడుకు హ్యాండిస్తే.. తండ్రి ఛాన్స్ ఇచ్చాడంటూ న్యూస్ కూడా హైలెట్ అవుతుంది.

మరి నిజంగా రకుల్ ప్రీత్ సింగ్ నాగార్జున పక్కన ఛాన్స్ వస్తేనే వెంకిమామ నుండి తప్పకుందా... లేదంటే వెంకిమామ టీమే రకుల్ ప్రీత్ ని తప్పించిందో క్లారిటీ లేదు కానీ.. రకుల్ కి మాత్రం బ్యాడ్ టైం మాములుగా స్టార్ట్ కాలేదు. ఒకప్పుడు చిన్న పెద్ద స్టార్ హీరోలతో సినిమాలు చేసిన రకుల్ ప్రీత్ కి ప్రస్తుతం స్టార్ హీరోలు మొహం చాటేసినా.. యంగ్ హీరోలైనా ఛాన్స్ ఇస్తారనుకుంటే.. ఆ అవకాశాలు కూడా సన్నగిల్లాయి.



By February 23, 2019 at 04:33AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44832/rakul-preet-singh.html

No comments