పెళ్లికి సిద్ధమౌతున్న మరో హీరోయిన్!
ఈ మధ్య ఇండియన్ హీరోయిన్స్ విదేశీ ప్రియులపై అమితాసక్తిని చూపిస్తున్నారు. ఈ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. బాలీవుడ్ హీరో షషికపూర్, నటి నీనా గుప్తా నుంచి మొదలైన ఈ తంతు ఇప్పటికి అలాగే కొనసాగుతోంది. ఆ మధ్య ప్రీతీ జింటా ఓ ఫారినర్‌ని పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిలైపోతే అదే బాటలో ఇలియానా, శ్రియ, లీసారే, ప్రియాంక చోప్రా వంటి హాట్ స్టార్స్ అంతా విదేశీయులను పెళ్లాడి వార్తల్లో నిలిచారు. త్వరలో తాప్సీ కూడా ఓ వీదేశీయుడిని పెళ్లడబోతోంది. ఇక ఈ జాబితాలో దక్షిణాది హీరోయిన్, కమల్‌హాసన్ గారాలపట్టి శృతిహాసన్ కూడా చేరబోతోంది.
గత కొంత కాలంగా సినిమాలకు కామా పెట్టిన శృతిహాసన్ లండన్‌కు చెందిన నటుడు, మ్యుజీషియన్ మైఖేల్ కోర్సల్‌తో డేటింగ్ చేస్తోంది. ఈ విషయాన్ని తండ్రి కమల్‌కు కూడా చెప్పిన శృతి ఇటీవల తమిళనాడులో జరిగిన తన ఫ్యామిలీ ఫంక్షన్‌కు కూడా సంప్రదాయ దుస్తుల్లో మైఖేల్‌ని తీసుకొచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సంఘటనతోనే శృతి మనసులో ఏముందో మీడియాతో పాటు చాలా మందికి తెలిసిపోయింది. అయితే కమల్‌హాసన్ నిర్మిస్తూ నటిస్తున్న `శభాష్ నాయుడు` సినిమాతో పాటు మహేష్ మంజ్రేకర్ రూపొందిస్తున్న చిత్రాలు తప్ప మరో సినిమాను అంగీకరించని శృతి ఈ ఏడాది మైఖేల్‌ను వివాహం చేసుకోబోతోందిని తెలిసింది.
ఈ విషయంలో ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిన శృతి ఇన్‌స్టాగ్రామ్‌లో మైఖేల్‌తో కలిసి వున్న ఓ ఫొటోను పోస్ట్ చేసింది. `ఇకపై మనల్ని ఎవరూ వేధించరని, వేరు చేయలేరని వాగ్ధానం చేస్తున్నాను` అని శృతి పోస్ట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెళ్లి విషయంలో పిచ్చ క్లారిటీతో వున్న శృతిహాసన్ తన పెళ్లి ఎప్పుడు ఎక్కడ వుంటుందన్న విషయాలపై త్వరలోనే ఓ క్లారిటీ ఇచ్చే అవకాశం వుందని తమిళ మీడియా అంటోంది.
By January 04, 2019 at 10:52PM
No comments