Breaking News

గుడ్ న్యూస్: మహానాయకుడు ట్రైలరొస్తోంది


ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించి రెండు పార్టులు ఉన్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఒక పార్ట్ రిలీజ్ అయ్యి ఫెయిల్ అయింది. ప్రస్తుతం రెండో పార్టుకి సంబంధించి షూటింగ్ జరుగుతుంది. ఇది ఇలా ఉంటే రెండు పార్ట్ లకు సంబంధించి ఒకటే ట్రైలర్, ఒకటే అడియో ఫంక్షన్ ను నిర్వహించారు మేకర్స్. మొదటి పార్ట్ కథానాయకుడు అంతా హడావిడిగా జరిగిపోయింది. అయితే ఇటువంటివి రెండో పార్ట్ మహానాయకుడు విషయంలో జరగకూడదని క్రిష్ భావిస్తున్నాడు.

అందుకే రెండోపార్ట్ కి సంబంధించి అదనపు షూట్ తప్పలేదు. ఫస్ట్ పార్ట్ లో లేని ఎమోషనల్ కంటెంట్ ను రెండోపార్ట్ లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రెండో పార్టు రిలీజ్ కు కూడా అందుకే లేట్ అవుతుంది. మొదట ఈ సినిమా వచ్చే నెల 7 న రిలీజ్ చేద్దాం అనుకున్నారు. అయితే దాన్ని 15న వాయిదా వేసుకున్నారు.

అయితే ఇప్పుడు ఈ డేట్ కూడా కాదనుకుని 24న బయోపిక్ ను విడుదల చేయాలని చూస్తున్నారు. అంతేకాదు రెండో పార్టుకి సంబంధించి ట్రైలర్ ని కూడా విడుదల చేయాలనీ చూస్తున్నారు. ఫస్ట్ వీక్ లో ట్రైలర్ వదలడం, రెండోభాగంపై డిఫరెంట్ పబ్లిసిటీ మెటీరియల్ వదలడం ప్రారంభిస్తారని తెలుస్తోంది. మరి ఇంత కష్టపడుతున్న క్రిష్ టీంకి సక్సెస్ అందుతుందో లేదో చూడాలి.



By January 30, 2019 at 09:11AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44494/balakrishna.html

No comments