Breaking News

అందరూ రాశి‌ఖన్నానే అంటున్నారు


బాబ్లీ గర్ల్ గా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన రాశిఖన్నా స్టార్ హీరోల పక్కన నటించకపోయినా.. యంగ్ హీరోలతో సినిమాలు చేస్తూ... దూసుకుపోతుంది. కాకపోతే అమ్మడుకి స్టార్ హీరోల పక్కన సినిమాలు చెయ్యాలని ఉన్నా ఆఫర్స్ ఇవ్వాలి కదా. ఏదో జై లవ కుశలో ఎన్టీఆర్ సరసన చెయ్యడానికి పాత్ర దొరికింది కానీ.. ప్రాధాన్యత లేకుండా పోయింది. ఇక గత ఏడాది వరుణ్ సరసన తొలిప్రేమ సినిమాలో నటించి సాలిడ్ హిట్ అందుకుంది. కానీ రాశికి మాత్రం స్టార్ హీరోలు అవకాశాలు ఇవ్వలేదు. ఇక తొలిప్రేమ హిట్ ని సరిగ్గా వాడుకోలేకపోయిన రాశిఖన్నా అంటూ సామజిక మాధ్యమాలలో అనేక రకాల వార్తలు ప్రచారంలోకొచ్చాయి..

కానీ తాజాగా హిట్ హీరోల పక్కన ఛాన్సులు కొట్టేసి రాశి టైం స్టార్ట్ అంటుంది... ఈ భామ. బాబ్లీ లుక్స్ నుండి జీరో లుక్స్ లోకి మారినా రాశిఖన్నా ప్రస్తుతం టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలో స్టార్ స్టేటస్ అందుకున్న విజయ్ దేవరకొండ సరసన ఛాన్స్ కొట్టేసింది. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో రాశిఖన్నా హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. మరి విజయ్ సరసన రాశి అంటే.. మాములు విషయం కాదు. ఇక తెలుగులో మాత్రమే కాదు.. తమిళంలోనూ విజయ్ సేతుపతి పక్కన హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది రాశి. 96 హిట్ తో ఉన్న విజయ్ సేతుపతి సరసన రాశి ఈ సినిమాని విజ‌య్ చంద‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో చేయబోతుంది. ఈ సినిమా మొత్తం గ్రామీణ నేప‌థ్యంలో సాగుతుందట‌. మరి ఈ సినిమాలో రాశి లంగా ఓణీ అంటే ట్రెడిషనల్ లుక్ లో కనువిందు చెయ్యబోతుందన్నమాట.

అలాగే శింబు సరసన వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కనున్న సినిమాలోనూ రాశిఖన్నానే హీరోయిన్. మరి తెలుగు తమిళంలో జోరుగా సినిమాలకు సైన్ చేస్తున్న రాశి మరో రెండు తెలుగు సినిమాల్లో నటించేందుకు సన్నద్దమవుతుందనే న్యూస్ చూశాక.. రాశికి అవకాశాలు లేదన్నది ఎవరు.. చూడండి రాశిఖన్నా టైం ఎలా మొదలైందో అంటూ కామెంట్ చేస్తున్నారు.



By January 30, 2019 at 09:04AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44493/raashi-khanna.html

No comments