Breaking News

కత్రినా సరే.. మహేష్‌ ఒప్పుకుంటాడా?


బాలీవుడ్‌, కోలీవుడ్‌ల తీరు వేరు. కానీ టాలీవుడ్‌ స్టార్స్‌ స్టైల్‌ మాత్రం దానికి విరుద్దం. తమిళంలో యంగ్‌స్టార్‌ అయిన విజయ్‌ సేతుపతితో పాటు పలువురు సీనియర్‌ హీరోయిన్లయిన త్రిష, నయనతార వంటి వారితో కూడా నటిస్తారు. ఇక కొత్తగా ఎంటర్‌ అయిన యువహీరోలు కూడా ఆల్‌రెడీ సీనియర్లయిన హీరోయిన్లతో జోడీ కట్టేందుకు రెడీగా ఉంటారు. ఈ విషయంలో బాలీవుడ్‌ మరో అడుగు ముందుంటుంది. అక్కడ సీనియర్‌ హీరోయిన్ల హవానే ఎక్కువ. యంగ్‌ హీరోయిన్లతో పోటీగా వారు అందరితో జోడీ కడుతుంటారు. కానీ టాలీవుడ్‌లో ఈ ట్రెండ్‌ లేదు. ఇక్కడ సీనియర్‌ స్టార్లయిన మెగాస్టార్‌ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్‌, కింగ్‌ నాగార్జున వంటి వారితో వారి వయసుకు తగ్గట్లుగా నటించిన హీరోయిన్లతో యంగ్‌స్టార్స్ నటించడానికి పెద్దగా ఆసక్తి చూపరు. వారి స్థానంలో యంగ్‌ హీరోయిన్లు కొత్త భామల వైపే దృష్టిసారిస్తారు. 

విషయానికి వస్తే దాదాపు 15ఏళ్ల కిందట కత్రినా కైఫ్‌, విక్టరీ వెంకటేష్‌తో కలిసి ‘మల్లీశ్వరి’, బాలకృష్ణతో ‘అల్లరిపిడుగు’ వంటి తెలుగు చిత్రాలలో నటించింది. అలాంటి కత్రినా, సుకుమార్‌, మహేష్‌బాబుల కాంబినేషన్‌లో రూపొందే మహేష్‌ 26వ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోందని వార్తలు వచ్చాయి. దానిపై తాజాగా కత్రినా కైఫ్‌ స్పందించింది. నేను మహేష్‌బాబుతో కలిసి నటించనున్నానని పలు వార్తలు వస్తున్నాయి. అందుకే ఇలాంటి పుకార్లకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం నేను సల్మాన్‌ఖాన్‌ సరసన ‘భారత్‌’ చిత్రంలో నటిస్తున్నాను. ఈ మూవీ రంజాన్‌ కానుకగా విడుదల కానుంది. ‘భారత్‌’ తర్వాత నేనే చిత్రానికి సంతకం చేయలేదు. ప్రస్తుతం నా దృష్టి అంతా ‘భారత్‌’, దాని ప్రమోషన్స్‌ మీదనే ఉందని క్లారిటీ ఇచ్చింది. 

అయినా కత్రినాతో నటించడానికి మహేష్‌ వంటి స్టార్‌ ఒప్పుకుంటాడా? ఏదో అలియాభట్‌, జాన్వికపూర్‌ వంటి వారికైతే ఓకే చెబుతాడు గానీ ఎప్పుడో దశాంద్బన్నర ముందు సీనియర్‌ స్టార్స్‌తో జోడీ కట్టిన కత్రినాని పెట్టుకోవాల్సిన అవసరం మహేష్‌కి ఏముందనేది అసలు పాయింట్‌..! 



By February 01, 2019 at 06:17AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44522/katrina-kaif.html

No comments