Breaking News

‘ఖైదీ’లో చిరంజీవిలా ఉన్నాడంటున్నారు?


ఓవర్‌సీస్‌తో పాటు రెండు రాష్ట్రాలలోని తెలుగు ప్రేక్షకుల అభిరుచిలో కూడా బాగా మార్పు కనిపిస్తోంది. మాస్‌, మసాలా, రొటీన్‌ చిత్రాలను కాకుండా వైవిధ్యభరితమైన చిత్రాలను బాగా ఆదరిస్తున్నారు. అయినా ఇప్పటికీ మాస్‌నే నమ్ముకున్న హీరోలు కూడా ఉన్నారు. తన కెరీర్‌లో ‘మగధీర’ తప్ప మరో పెద్ద ఓవర్‌సీస్‌ విజయం లేని స్టార్‌గా మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ విమర్శల పాలయ్యాడంటే దానికి కేవలం ఆయన ఎంచుకున్న రొటీన్‌ రొడ్డ కొట్టుడు కథల వల్లే అని చెప్పాలి. అయితే ‘ధృవ’ తో ఆయన రూట్‌ మార్చాడు. ఓవర్‌సీస్‌లో ఆల్‌రెడీ ఈ చిత్రం తమిళ వెర్షన్‌ని బాగానే చూసి ఉండటంతో ఈ చిత్రం కూడా పెద్ద హిట్‌ని చరణ్‌కి అందించలేకపోయింది. 

కానీ మాస్‌ని జొప్పిస్తూనే సుకుమార్‌ రామ్‌చరణ్‌తో చేసిన విభిన్న మ్యాజిక్‌ ‘రంగస్థలం’ మాత్రం ఓ ఆటాడుకుంది. ఇక చరణ్‌కి రెండు విభిన్న చిత్రాల తర్వాత మరోసారి మాస్‌ చిత్రం వినయ విధేయ రామ చేయడం కాస్త మంచి ప్రయత్నమే. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌ ‘ఎన్టీఆర్‌’ ట్రైలర్‌ కంటే మంచి రెస్పాన్స్‌ని దక్కించుకుంటోంది. అయితే తెలుగు ప్రేక్షకుల సంగతి వేరు... ఓవర్‌సీస్‌ ఆడియన్స్‌ అభిరుచి వేరు. వారు ఏదైనా కొంత అయినా విభిన్నంగా లేకుంటే తమ విలువైన డబ్బు, సమయాన్ని వృధా చేయరు. 

ఇక ‘వినయ విధేయ రామ’ చిత్రం విషయానికి వస్తే ఈ చిత్రం ట్రైలర్‌ ఊరమాస్‌గా ఉంది. ఇక తాజాగా చరణ్‌లోని వీరత్వం, ధీరత్వం చూపిస్తూ వదిలిన పోస్టర్‌ని రాంబో లుక్‌తో పోలుస్తున్నారు. నాడు ఖైదీ చిత్రంలో కూడా చిరు ఇలానే కనిపించాడు. కాకపోతే కాలానుగుణంగా వచ్చిన మార్పుల వల్ల మరింత ఉగ్రరూపం కనిపిస్తోంది. ‘ఖైదీ’కి మూలమైన ‘ఫస్ట్‌బ్లడ్‌’ మూలం దీనిలో కనిపిస్తోంది. మరోవైపు ఇందులో మాస్‌, యాక్షన్‌ అంశాలతో పాటు ఫ్యామిలీ సెంటిమెంట్‌ కూడా ఉంటుందని, ఇది చరణ్‌కి తన తండ్రి ‘గ్యాంగ్‌లీడర్‌’ వంటి చిత్రం అవుతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. 

అయినా బోయపాటి తెలుగు రాష్ట్రాలలోనే ఊర మాస్ ప్రేక్షకులను మెప్పించినట్లుగా ఇప్పటివరకు ఓవర్‌సీస్‌లో తన సత్తా చాటలేకపోయాడు. మరి విడుదలకు ముందు రాబోయే ట్రైలర్స్‌, పోస్టర్ల ద్వారా ఏమైనా ఫ్యామిలీ సెంటిమెంట్‌ని పండిస్తే అయినా ఇది ఓవర్‌సీస్‌లో మంచి కలెక్షన్లు సాధించే అవకాశం లేదని ట్రేడ్‌ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక ఫ్యామిలీ, కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ‘ఎఫ్‌ 2’, బయోపిక్‌లను బాగా ఆదరించే ఓవర్‌సీస్‌ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌లపై మంచి ఆసక్తి రేగుతోంది. మరి బోయపాటి ఈసారి చరణ్‌ తోడుతోనైనా ఓవర్‌సీస్‌ని మెప్పిస్తాడో? లేదో వేచిచూడాల్సివుంది..! 



By January 02, 2019 at 05:04AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44115/vinaya-vidheya-rama.html

No comments